Moviesబాధ‌లోనూ నవ్విస్తున్న న‌వీన్ పోలిశెట్టి.. సింగిల్ హ్యాండ్‌తో యంగ్ హీరో తిప్ప‌లు...

బాధ‌లోనూ నవ్విస్తున్న న‌వీన్ పోలిశెట్టి.. సింగిల్ హ్యాండ్‌తో యంగ్ హీరో తిప్ప‌లు చూశారా?

టాలీవుడ్ యంగ్ స్టార్ న‌వీన్ పోలిశెట్టి కొద్ది నెల‌ల క్రితం అమెరికాలో యాక్సిడెంట్ కు గురైన సంగ‌తి తెలిసిందే. ఆ ప్ర‌మాదంలో న‌వీన్ తీవ్రంగా గాయ‌ప‌డ్డాడు. ముఖ్యంగా అత‌ని కూడి చేయి బాగా ఫ్యాక్చర్ అయింది. ప్ర‌స్తుతం ఇంటికే ప‌రిమితం అయిన న‌వీన్ పోలిశెట్టి.. త్వ‌ర‌గా రిక‌వ‌రీ అయ్యేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాడు. ఘ‌టన జ‌రిగిన మూడు నెల‌ల త‌ర్వాత యాక్సిడెంట్‌ విష‌యాన్ని న‌వీన్ పోలిశెట్టి ఇటీవ‌లె బ‌య‌ట‌పెట్టాడు.

గాయాలు చాలా బాధిస్తున్నాయ‌ని.. రిక‌వ‌రీ అనేది స్లోగా ఉంద‌ని న‌వీన్ తెలిపాడు. క‌చ్చితంగా స్ట్రోంగ్ కంబ్యాక్ ఇస్తాన‌ని త‌న అభిమానుల‌కు హామీ ఇచ్చాడు. అయితే తాజాగా సోష‌ల్ మీడియా ద్వారా లైఫ్ ఒక జిందగీ అయిపోయిందంటూ న‌వీన్ పోలిశెట్టి ఓ వీడియోను పంచుకున్నాడు. యాక్సిడెంట్ త‌ర్వాత సింగిల్ హ్యాండ్ తో తాను ప‌డే తిప్ప‌ల‌ను ఫ‌న్నీగా న‌వీన్ ఈ వీడియోలో చూపించాడు. వీడియోలో నవీన్ టీవీ చూస్తుండ‌గా.. గ‌ణేష్ మూవీలో ఎనీ సెంట‌ర్ సింగిల్ హ్యాండ్ అంటూ వెంక‌టేష్ డైలాగ్ చెప్ప‌డంతో త‌న‌ని తాను చూసుకుంటూ ఛాన‌ల్ మార్చమంటాడు.

ఆ త‌ర్వాత చేయి చూసావా ఎంత రఫ్‌గా ఉందో అంటూ గ్యాంగ్ లీడ‌ర్ డైలాగ్ వ‌స్తుంది. దాంతో న‌వీన్ చిరాకు ప‌డి చేయి మీద డైలాగ్‌లు లేని ఛాన‌ల్ పెట్ట‌మంటారు. క్రికెట్ ఛానెల్ పెట్ట‌గా.. అందులో అంపైర్ సిక్స్ అంటూ రెండు చేతులు పైన‌కి లేపుతాడు. అది చూసి న‌వీన్ కు మ‌రికాస్త విసుగుపుడుతుంది. ఇంకొక సీన్ లో సింగిల్ హ్యాండ్ తో చ‌ప్ప‌ట్ల కొట్ట‌లేక త‌న ఎడ‌మ చేతితో చెంప‌లు వాయించుకుంటూ న‌వీన్ ఫ‌న్ క్రియేట్ చేశాడు.

ఇక చివ‌ర్లో కూడి చేయి ఫ్యాక్చర్ అవ్వ‌డం వ‌ల్ల అన్నం తిందామ‌ని ఎడ‌మ చేయి వాడ‌తాడు. స‌రిగ్గా అప్పుడే ఎవ‌రైనా ఎడ‌మ చేతితో అన్నం తింటారా? ఇదేం సంస్కారం? అంటూ బ్యాక్‌గ్రౌండ్ లో డైలాగ్స్ వ‌స్తాయి. దెబ్బ‌కు న‌వీన్ ఎడ‌మ చేయి తీసేసి సంస్కారం ఇంపార్టెంట్‌రా అంటూ డాగ్‌లా ప్లేట్ లో నేరుగా నోరు పెట్టి భోజనం చేస్తాడు. మొత్తానికి యాక్సిడెంట్ వ‌ల్ల బాధ‌లో ఉన్నా కూడా న‌వీన్ పోలిశెట్టి మాత్రం త‌న ప‌రిస్థితుల‌ను కామెడీగా చూపిస్తూ అంద‌ర్నీ న‌వ్వించాడు. ప్ర‌స్తుతం న‌వీన్ పోలిశెట్టి వీడియో నెట్టింట తెగ చ‌క్క‌ర్లు కొట్టేస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news