Moviesఆ సినిమాలోని ఆ పాత్రే సౌందర్యను బలి తీసుకుందా.. షాకింగ్ సీక్రెట్..?

ఆ సినిమాలోని ఆ పాత్రే సౌందర్యను బలి తీసుకుందా.. షాకింగ్ సీక్రెట్..?

దివంగత నటి సౌందర్య చనిపోయి దాదాపు రెండు దశాబ్దాలు పూర్తయినా కూడా ఇప్పటికీ ఆమె పేరు తలుచుకొని సినీ ఇండస్ట్రీ జనాలు ఉండరు. ఆమె సినిమా నచ్చని సినీ ప్రేక్షకులు ఉండరు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే అలాంటి సౌందర్య మరణించాక ఆమె గురించి ఎన్నో పుకార్లు టాలీవుడ్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఇక సౌందర్య మరణించే సమయంలో ఆమె ప్రెగ్నెంట్ గా ఉంది అని కొంతమంది అంటే, లేదు అదంతా పుకారే అని మరి కొంతమంది అన్నారు. అలాగే సౌందర్య మరణానికి ముందు అది జరిగింది ఇది జరిగింది అంటూ చెప్పుకుంటూ ఆ మధ్యకాలంలో చాలా రూమర్స్ వినిపించాయి.

ఇక సౌందర్యని చంపడానికి కొంతమంది ప్లాన్ వేసారని కూడా రూమర్స్ వినిపించాయి. కానీ సౌందర్యని ఎవరూ చంపలేదు. ఆమె విమాన ప్రమాదంలోనే మరణించింది. అయితే సౌందర్య మరణానికి ఆ సినిమాలోని పాత్రనే కారణమని ఆ పాత్ర సౌందర్యని బలితీసుకుంది అంటూ సౌందర్య మరణం తర్వాత ఒక షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. అదేంటంటే.. రజినీకాంత్ చేసిన చంద్రముఖి సినిమా అందరూ చూసే ఉంటారు. అయితే చంద్రముఖి మూవీ కన్నడలో ఆప్తమిత్ర అనే టైటిల్ తో విడుదలైంది.

ఇక ఆప్తమిత్ర సినిమాలో సౌందర్య నాగవల్లి పాత్రను పోషించింది. అయితే ఈ సినిమాలోని నాగవల్లి పాత్రనే సౌందర్యని బలితీసుకుంది అని అప్పట్లో ఓ టాక్ వినిపించింది. దానికి ప్రధాన కారణం ఈ సినిమా సీక్వెల్ గా వచ్చిన ఆప్తమిత్ర-2 నటించిన నటుడు విష్ణువర్ధన్ సినిమా షూటింగ్ తర్వాత మరణించాడు.
అలాగే ఆప్తమిత్ర సినిమాలో నాగవల్లి పాత్ర పోషించిన సౌందర్య కి డబ్బింగ్ చెప్పిన డబ్బింగ్ ఆర్టిస్ట్ శశికళ కూడా ఈ సినిమాలో డబ్బింగ్ చెబుతున్నన్ని రోజులు తన చుట్టూ ఏదో తెలియని శక్తి ఉన్నట్లు తనని భయపెడుతున్నట్లు తనని ఆవహించినట్లు భావన కలిగేది అంటూ ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని బయట పెట్టింది.

దాంతో ఈ సినిమా తర్వాత సౌందర్య మరణం అలాగే డబ్బింగ్ ఆర్టిస్ట్ శశికళ మాట్లాడిన మాటలు, అంతేకాకుండా ఆప్తమిత్ర-2 లో చేసిన నటుడు విష్ణువర్ధన్ మరణంతో ఈ సినిమాకి సౌందర్యకి మరణానికి మధ్య ఏదో సంబంధం ఉందని, ఆ సినిమాలోని నాగవల్లి పాత ని సౌందర్య బలితీసుకుంది అనే రూమర్ అప్పట్లో చాలా బలంగా వినిపించింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news