Moviesబూరె బుగ్గలతో సూప‌ర్ క్యూట్‌గా ఉన్న ఈ చిన్నారి ఎవ‌రో గుర్తుప‌ట్టారా.....

బూరె బుగ్గలతో సూప‌ర్ క్యూట్‌గా ఉన్న ఈ చిన్నారి ఎవ‌రో గుర్తుప‌ట్టారా.. సౌత్ లో మోస్ట్ ఫేమ‌స్ హీరోయిన్‌!

ఈ మధ్యకాలంలో సినీ తారల చైల్డ్ హుడ్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి. తాజాగా ఈ జాబితాలో పైన కనిపిస్తున్న ఫోటో కూడా చేరింది. ఇంతకీ ఆ ఫోటోలో బూరె బుగ్గలతో సూపర్ క్యూట్ గా కనిపిస్తున్న చిన్నారి ఎవరో గుర్తుపట్టారా..? మన సౌత్ ఫిల్మ్‌ ఇండస్ట్రీలో ఆమె మోస్ట్ ఫేమస్ హీరోయిన్. భారీ సినీ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చినప్పటికీ తనదైన ప్రతిభతో స్టార్ ఇమేజ్ ను సంపాదించుకుంది. త్వరలోనే బాలీవుడ్ లోకి కూడా అడుగు పెట్టబోతోంది. ఇంకా గుర్తుపట్టలేదా.. ఆమె మరెవరో కాదండి కీర్తి సురేష్.

మలయాళ సినీనిర్మాత సురేష్ కుమార్, ఒక‌ప్ప‌టి స్టార్ హీరోయిన్‌ మేనక దంప‌తుల‌కు జ‌న్మించిన కీర్తి సురేష్‌.. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించింది. 2013లో గీతాంజలి అనే మ‌ల‌యాళ చిత్రంతో హీరోయిన్ గా మారింది. 2016లో నేను శైలజతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టి.. తొలి ప్ర‌య‌త్నంలోనే తెలుగు ప్రేక్షకుల హృద‌యాల‌ను గెలుచుకుంది. అటు తమిళంలో రజిని మురుగన్ మూవీతో మంచి గుర్తింపు సంపాదించుకుంది.

రైల్, రెమో, నేను లోకల్ వంటి చిత్రాలు కీర్తి సురేష్ క్రేజ్ మ‌రింత పెంచాయి. 2018లో విడుద‌లైన మహానటి చిత్రంతో కీర్తి సురేష్ జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. అల‌నాటి తార సావిత్రిని మైమ‌ర‌పించే విధంగా న‌టించి విమ‌ర్శ‌కుల నుంచి సైతం కీర్తి ప్ర‌శంస‌లు అందుకుంది. మ‌హాన‌టి త‌ర్వాత సౌత్ లో కీర్తి సురేష్ ఫుల్ బిజీగా మారింది. ఓవైపు క‌మ‌ర్షియ‌ల్ చిత్రాల్లో న‌టిస్తూనే.. మ‌రోవైపు లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తోంది.

గ‌త ఏడాది దసరా, ఈ ఏడాది సైర‌న్ చిత్రాలతో హిట్లు అందుకున్న కీర్తి సురేష్‌.. త్వ‌ర‌లోనే రఘుతాత అనే మూవీతో థియేట‌ర్స్ లో సంద‌డి చేయ‌బోతోంది. అలాగే త‌మిళంలో రివాల్వర్ రీటా, కన్నివేది అనే రెండు సినిమాల్లో న‌టిస్తోంది. మ‌రోవైపు బాలీవుడ్ లో త‌న డెబ్యూ మూవీకి కూడా కీర్తి సంత‌కం చేసింది. అదే బేబీ జాన్‌. త‌మిళ సూప‌ర్ హిట్ తేరి కి హిందీ రీమేక్ ఇది. వరుణ్ ధావన్, కీర్తి జంట‌గా న‌టిస్తున్న బేబీ జాన్ మూవీ 2024 డిసెంబ‌ర్ 25న‌ విడుద‌ల

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news