Moviesదేవి శ్రీ ప్ర‌సాద్ ఆస్తుల విలువ ఎన్ని కోట్లో తెలుసా.. హీరోలు...

దేవి శ్రీ ప్ర‌సాద్ ఆస్తుల విలువ ఎన్ని కోట్లో తెలుసా.. హీరోలు కూడా దిగ‌దుడుపే..!

గంధం శ్రీప్రసాద్ అలియాస్ దేవి శ్రీ ప్ర‌సాద్ అంటే తెలియ‌ని మ్యూజిక్ ల‌వ‌ర్స్ ఉండ‌రు. దాదాపు రెండు ద‌శాబ్దాల నుంచి ద‌క్ష‌ణాది చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో స్టార్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ గా దేవి శ్రీ ప్ర‌సాద్ స‌త్తా చాటుతున్నాడు. తెలుగు, త‌మిళ చిత్రాల‌కు ప్ర‌ధానంగా ప‌ని చేశాడు. స్వరకర్తగా, గాయకుడుగా మరియు గీత రచయితగా త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. స్టార్ హీరోల సినిమాల‌కు మోస్ట్ వాంటెడ్ గా మారాడు.

థ‌మ‌న్‌, అనిరుధ్ వంటి వారి వ‌ల్ల ఈ మ‌ధ్య డ‌ల్ అయినా.. ఒక‌ప్పుడు మాత్రం దేవి శ్రీ ప్ర‌సాద్ సంగీతం ఓ సంచ‌ల‌నం. దేవి శ్రీ మ్యూజిక్ వల్లే హిట్ అయిన సినిమాలు కూడా ఎన్నో ఉన్నాయి. ల‌వ్‌, సాడ్‌, పాప్‌, మాస్.. ఇలా అన్ని ర‌కాల జోన‌ర్ సాంగ్స్ దేవి శ్రీ లిస్ట్ లో ఉంటాయి. చాలా చిన్న వ‌య‌సులోనే మ్యూజిక్ కంపోజ‌ర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన దేవి శ్రీ.. 21 సంవత్సరాల కాలంలో 100 చిత్రాలకు పైగా పనిచేశారు.

ఈ క్ర‌మంలోనే భారీగా ఆస్తుల‌ను కూడా కూడ‌బెట్టాడు. ప‌లు నివేదిక‌ల ప్ర‌కారం.. దేవి శ్రీ ప్ర‌సాద్ ఆస్తుల విలువ అక్ష‌రాల రూ. 50 కోట్ల వ‌ర‌కు ఉంటుంద‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం ఒక్కో సినిమాకు దేవి శ్రీ ప్ర‌సాద్ రూ. 3 నుంచి 4 కోట్ల రేంజ్ లో రెమ్యున‌రేష‌న్ ఛార్జ్ చేస్తున్నాడు. ఆస్తుల ప‌రంగా.. టాలీవుడ్ లో చాలా మంది హీరోలు దేవి శ్రీ ముందు దిగ‌దుడుపే అని చెప్పాలి.

ఇక‌పోతే దేవి శ్రీ ప్ర‌సాద్ స్టిల్ బ్యాచిల‌ర్. ఆయ‌న ఏజ్ 45. కానీ ఇంత వ‌ర‌కు పెళ్లి చేసుకోలేదు. గ‌తంలో ప్ర‌ముఖ హీరోయిన్ ఛార్మీతో దేవి శ్రీ ప్రేమాయ‌ణం న‌డుపుత‌న్న‌ట్లు పెద్ద ఎత్తున వార్త‌లు వచ్చారు. ఛార్మీ, దేవి శ్రీ క్లోజ్ గా ఉన్న కొన్ని ఫోటోలు బ‌య‌ట‌కు రావ‌డంతో.. ఇద్ద‌రూ పెళ్లి చేసుకోవ‌డం ఖాయ‌మ‌ని అంద‌రూ భావించారు. కానీ అలా ఏమీ జ‌ర‌గ‌లేదు. ఛార్మీ యాక్టింగ్ కు పులిస్టాప్ పెట్టి పూరీ జ‌గ‌న్నాథ్ తో క‌లిసి సినిమాలు నిర్మించ‌డం స్టార్ట్ చేసింది. పూరీ వ‌ల్లే దేవి శ్రీ ప్ర‌సాద్, ఛార్మీ విడిపోయార‌నే టాక్ టాలీవుడ్ లో ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news