అల్లుడు ఎదుగుతుంటే మామ ఓర్వలేడా ఇది ఎక్కడి విడ్డూరం అనుకుంటారు కొంతమంది. అయితే సామాన్య జనాలు అంటే ఏమో కానీ సెలబ్రిటీలలో కూడా ఇలా ఉంటారా అని కొంతమంది భావిస్తూ ఉంటారు. అయితే అలాంటిదే మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీలో జరిగిందని ఇప్పటికీ ఫిలిం ఇండస్ట్రీలో ఓ టాక్.అదేంటంటే.. రామ్ చరణ్ పాన్ ఇండియా హీరో కాకుండా అల్లు అరవింద్ కుట్ర చేశారని గత కొద్ది సంవత్సరాలుగా ఓ వార్త ఇండస్ట్రీలో వినిపిస్తూనే ఉంది.
మరి ఇంతకీ రామ్ చరణ్ పాన్ ఇండియా హీరో కాకుండా అల్లు అరవింద్ ఎందుకు అడ్డుకున్నారు అనేది ఇప్పుడు చూద్దాం.. రామ్ చరణ్ హీరోగా చేసిన సెకండ్ మూవీ మగధీర ఎంత పెద్ద హిట్టో చెప్పనక్కర్లేదు.
ఈ సినిమాని దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించారు. అయితే ఈ బ్లాక్ బస్టర్ మూవీ పెట్టిన బడ్జెట్ కి మూడు నాలుగు రెట్లు ఎక్కువగా లాభాలు వచ్చాయట.. అయితే ఈ సినిమాని గీతా ఆర్ట్స్ బ్యానర్ లో రామ్ చరణ్ మేన మామ అల్లు అరవింద్ తెరకెక్కించారు. అయితే ఈ సినిమాని తెరకెక్కించే సమయంలో సినిమా స్టోరీ బాగుండడంతో రాజమౌళి ఈ మూవీని పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కిద్దాం అని చెప్పారట.
కానీ అల్లు అరవింద్ మాత్రం అలా చేస్తే ఎక్కువ బడ్జెట్ పెట్టాలి. అంతేకాకుండా అన్ని భాషల్లో ఈ సినిమాని ఆదరించకపోతే నష్టాల పాలవుతాం అని వద్దన్నారట.కానీ ఈ సినిమా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాక చాలామంది పాన్ ఇండియా లెవెల్ లో తీసినా కూడా అది పెద్ద హిట్ అయ్యేది అని మాట్లాడుకున్నారట. ఇక ఈ విషయం మీడియాలో వైరల్ అవ్వడంతో కొంతమంది గాసిప్ రాయుళ్లు రామ్ చరణ్ ఎక్కడ తన కొడుకు కంటే ఎక్కువ ఎదిగిపోతాడోనని భయపడి రామ్ చరణ్ పాన్ ఇండియా హీరో కాకుండా మగధీర సినిమాకి అల్లు అరవింద్ బ్రేక్ వేశాడు అంటూ రూమర్స్ పుట్టించారు.
ఇక మగధీర సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో తీస్తే కనుక మొదటి పాన్ ఇండియా మూవీ రామ్ చరణ్ దే అయ్యేది అంటూ కామెంట్స్ పెట్టారు. కానీ దీనిలో ఎలాంటి నిజం లేదు.ఎందుకంటే మేనల్లుడు ఎదిగితే అల్లు అరవింద్ కి పోయేదేమీ ఉండదు. ఫలితంగా అల్లు, మెగా ఫ్యామిలీ ల పేరు ప్రతిష్టలు దేశవ్యాప్తంగా పెరుగుతాయి అని కొంతమంది అల్లు,మెగా ఫ్యామిలీ సన్నిహితులు ఆ వార్తలను ఖండించారు.