ఏంటి అక్కినేని అమల నాగార్జున కంటే ముందే మరో హీరోను ప్రేమించిందా.. ఆ హీరో ని పెళ్లి కూడా చేసుకోవాలనుకుందా.. ఇది నిజమేనా లేక రూమరా అని అనుకుంటారు ఈ విషయం తెలిసిన చాలా మంది జనాలు.మరి నిజంగానే అమల వేరే హీరో ప్రేమలో పడిందా అనేది ఇప్పుడు చూద్దాం.. నాగార్జున,లక్ష్మికి విడాకులు ఇచ్చాక తనతో కలిసి సినిమాల్లో హీరోయిన్ గా చేసిన సహనటి అమలతో ప్రేమలో పడి ఆమె మెడలో మూడు ముళ్ళు వేశారు.
ఇక వీరి కాంబినేషన్లో శివ, నిర్ణయం,చినబాబు, ప్రేమ యుద్ధం, కిరాయి దాదా వంటి హిట్ సినిమాలు వచ్చాయి.అలా వరుస సినిమాల్లో చేస్తున్న సమయంలోనే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించి పెళ్లి వరకు వెళ్ళింది.అయితే నాగార్జున కంటే ముందే అమల మరో హీరో ని ప్రేమించిందట. అయితే ఆ హీరో తెలుగు హీరో కాదు తమిళ్ హీరో కార్తీక్.. సీనియర్ హీరో కార్తీక్, అమల ఇద్దరు ప్రేమించుకున్నారని కోలీవుడ్ ఇండస్ట్రీ లో టాక్ వినిపించింది.వీరి కాంబినేషన్లో వచ్చిన సినిమా షూటింగ్ సమయంలో ఇద్దరు ప్రేమలో పడ్డారనే రూమర్ వినిపించింది. మరీ ముఖ్యంగా వీరిద్దరి మధ్య ప్రేమ రూమర్స్ ఎక్కువ వినిపించింది ఘర్షణ మూవీ టైంలో.
అయితే వీరిద్దరి మధ్య ఉన్న ప్రేమాయణం ఎక్కువ మందికి తెలియదు. కేవలం అమల,కార్తిక్ దగ్గరి సన్నిహితులకు మాత్రమే తెలుసట. ఎందుకంటే వీరిద్దరూ ఎక్కువగా ఎక్కడా కలిసి తిరగలేదు. అయితే వీరిద్దరి మధ్య ప్రేమ ఎలా చెడిందో తెలియదు కానీ ఇద్దరు విడిపోయారు.ఆ తర్వాత అమల తమిళ్ ఇండస్ట్రీకి దూరం అయ్యి టాలీవుడ్ కి వచ్చేసింది. అలా తెలుగు ఇండస్ట్రీ లో అప్పటి యువ హీరో నాగార్జునతో ప్రేమలో పడి ఆయన్ని పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం వీరిద్దరు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆదర్శ దంపతులుగా మంచి పేరు తెచ్చుకున్నారు.