పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఫుల్ బిజీగా గడుపుతున్నారు. అయితే గత కొద్ది సంవత్సరాల ముందు నుండి రాజకీయాల్లో రాణించాలని చూస్తున్నారు కానీ సక్సెస్ కాలేదు. అయితే ఈసారి మాత్రం ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఎలాగైనా అధికారంలోకి వచ్చి పేద ప్రజలకు తన వంతు సహాయం చేయాలి అనుకున్నారు పవన్ కళ్యాణ్.అలా టిడిపితో కూటమిగా ఏర్పడి ఏపీలో ఘనవిజయం సాధించారు. ఈ విషయం పక్కన పెడితే పవన్ కళ్యాణ్ ని రాజకీయంగా నిందించడానికి ఏమీ లేవు.
కాబట్టి చాలామంది ఆయన వ్యక్తిగత విషయంలోకి వెళ్లి మూడు పెళ్లిళ్లు అంటూ హేళన చేస్తూ ఉంటారు. అయినప్పటికీ పవన్ కళ్యాణ్ వాటన్నింటినీ తట్టుకొని నిలబడుతున్నారు. అయితే పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ రెండో పెళ్లి చేసుకుంటానని గతంలో అనుకుంది. అంతే కాదు ఎంగేజ్మెంట్ కూడా చేసుకుంది. కానీ తన పిల్లల కోసం ఎంగేజ్మెంట్ ని క్యాన్సల్ చేసుకొని వారే తన జీవితం అన్నట్లు బతికింది. అయితే రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే నా పిల్లలు ఒంటరివారై డిప్రెషన్ లోకి వెళ్తారని పెళ్లి చేసుకోలేదు. ప్రస్తుతం వాళ్లు పెద్దవాళ్ళు అయ్యారు. వాళ్లే నన్ను రెండో పెళ్లి చేసుకోమని సలహా ఇస్తున్నారు. మంచి వ్యక్తి దొరికితే ఖచ్చితంగా మళ్ళీ పెళ్లి చేసుకుంటాను అని చెప్పింది.
అయితే రేణుదేశాయ్ రెండో పెళ్లి అనేసరికి పవన్ అభిమానుల అహం హర్ట్ అవుతుందో ఏమో తెలియదు కానీ ఆమె రెండో పెళ్లిని అస్సలు సపోర్ట్ చేయరు. మీరు ఎప్పటికీ మా అన్నయ్య భార్య లాగే ఉండాలి అని ఆమెకు నెగిటివ్ కామెంట్లు పెడుతూ ఉంటారు. కానీ వీరి కామెంట్లకు రేణు దేశాయ్ ధీటుగా సమాధానం ఇస్తుంది. ఈ విషయం పక్కన పెడితే.. గతంలో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ప్రోగ్రాంలో మీరు రెండో పెళ్లి చేసుకుంటానంటే పవన్ ఏమని స్పందించారు అని రేణు దేశాయ్ ని అడగగా.. నేను పెళ్లి చేసుకుంటానంటే పవన్ కళ్యాణ్ నన్ను ఏమీ అనలేదు. ఫోన్ చేసి మరీ బెస్ట్ ఆఫ్ లక్ చెప్పారు.. కానీ మంచి వ్యక్తిని చేసుకోండి. బ్యాగ్రౌండ్ ఎలాంటిదో తెలుసుకోండి అని చెప్పారు.
అలాగే పవన్ కళ్యాణ్ కి అన్నా లెజ్నోవా తో బాబు పుట్టిన సమయంలో నేను కూడా ఆయనకి ఫోన్ చేసి విష్ చేశాను. మా మధ్య దూరం ఏమీ లేదు. మంచి చెడులు తెలుసుకుంటాం అంటూ రేణు దేశాయ్ చెప్పింది.కానీ ఈ ఇంటర్వ్యూ తర్వాత కొంతమంది గాసిప్ రాయుళ్లు రేణు దేశాయ్ రెండో పెళ్లి చేసుకుంటానంటే పవన్ కళ్యాణ్ ఫోన్ చేసి మరీ వార్నింగ్ ఇచ్చారు అంటూ తప్పుడు వార్తలు రాశారు. కానీ అందులో ఎలాంటి నిజం లేదు.ఎందుకంటే రేణు దేశాయ్ స్వయంగా ఓపెన్ హర్ట్ విత్ ఆర్కే ప్రోగ్రాంలో పవన్ కళ్యాణ్ తనకి ఫోన్ చేసి మరీ బెస్ట్ ఆఫ్ లక్ చెప్పారనే విషయాన్ని గుర్తు చేసింది.