Newsరవితేజకి ఆ హీరోయిన్ అంటే అంత ఇష్టమా.. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారా..?

రవితేజకి ఆ హీరోయిన్ అంటే అంత ఇష్టమా.. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారా..?

మాస్ మహారాజా రవితేజ కి నిజంగానే ఆ హీరోయిన్ అంటే ఇష్టమా.. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారా.. మరి ఇంతకీ రవితేజ భార్యగా అయ్యే ఛాన్స్ ని మిస్ చేసుకున్న ఆ హీరోయిన్ ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం.. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా.. స్టార్ హీరోల సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషిస్తూ టాలీవుడ్ లో టైర్ -2 హీరోల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు నటుడు రవితేజ. రవితేజ ని ఇడియట్, నేనింతే, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి,వెంకీ, విక్రమార్కుడు, భద్ర, కిక్, దుబాయ్ శీను, బలుపు, రాజా ది గ్రేట్,క్రాక్ వంటి సినిమాలు స్టార్ హీరోగా నిలబెట్టాయి.

ఇక రీసెంట్ గా రవితేజ నటించిన రామారావు ఆన్ డ్యూటీ, రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు,ఈగల్ వంటి సినిమాలు అంతగా ఆకట్టుకోలేవు. అయితే అలాంటి రవితేజ నిజంగానే ఆ హీరోయిన్‌ని ప్రేమించారా అనేది ఇప్పుడు చూద్దాం.. రవితేజ హరీష్ శంకర్ కలిసి మిరపకాయ్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో రవితేజకి కొన్ని ఆసక్తికరమైన ప్రశ్నలు ఎదురయ్యాయి. ఇందులో భాగంగా మీకు బాగా ఇష్టమైన డైరెక్టర్ ఎవరు అని రాజమౌళి, వివి వినాయక్, కృష్ణ వంశీ, పూరి జగన్నాథ్ వంటి పేర్లు చెప్పింది యాంకర్. దీనికి రవితేజ నాకు ఆ నలుగురు డైరెక్టర్లు అంటే చాలా ఇష్టం.

వీరిలో ఎవరికి ఎవరు తక్కువ కాదు.నాకు ఈ నలుగురు సమానమే అంటూ రవితేజ చెప్పారు. అలాగే ఇదే ఇంటర్వ్యూలో మీకు ఇష్టమైన హీరోయిన్ ఎవరు అని అడిగి త్రిష, అనుష్క, శ్రియ, ఇలియానా వంటి హీరోయిన్ల పేర్లు చెప్పింది.. ఇక ఈ ప్రశ్నకి రవితేజ ఏ సమాధానం చెప్పాలో అర్థం కాక కాసేపు ఆలోచించి అనుష్క అని చెప్పేసాడు. అయితే ఆ ఇంటర్వ్యూకి సంబంధించిన ఓల్డ్ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవ్వడంతో రవితేజ కి అనుష్క అంటే అంత ఇష్టమా.. నిజంగానే ఆమెతో డేటింగ్ చేశాడా ఏంటి అంటూ నెటిజన్స్ కామెంట్లు పెడుతున్నారు. అయితే రవితేజ అనుష్క కాంబినేషన్లో బలాదూర్, విక్రమార్కుడు వంటి రెండు సినిమాలు వచ్చాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news