Moviesనాలుగో పెళ్లికి రెడీ అవుతున్న వనిత విజయకుమార్.. ఆ మాట‌ల‌కు అర్థం...

నాలుగో పెళ్లికి రెడీ అవుతున్న వనిత విజయకుమార్.. ఆ మాట‌ల‌కు అర్థం అదేనా..?

న‌టి వ‌నిత‌ విజ‌య‌కుమార్ గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. సినిమాల క‌న్నా వివాదాలు, వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల ద్వారానే వ‌నిత తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఎక్కువ పాపుల‌ర్ అయింది. సొంత కుటుంబ‌స‌భ్యుల‌తో గొడ‌వ‌లు, మూడు పెళ్లిళ్ల వ్య‌వ‌హారంతో ప‌లుమార్లు వార్త‌ల్లో నిలిచింది. తాజాగా మ‌రోసారి వ‌నిత పేరు మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. నాలుగో పెళ్లికి వ‌నిత రెడీ అవుతుందంటూ కోలీవుడ్ లో జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది.

2000లో నటుడు ఆకాష్‌ను వ‌నిత మొద‌ట వివాహం చేసుకుంది. ఈ దంప‌తుల‌కు విజయ్‌ హరి, జోవిక అనే ఇద్దరు పిల్ల‌లు జ‌న్మించారు. 2005లో విడాకులతో ఆకాష్‌-వ‌నితల బంధం ముగిసింది. అయితే కుమారుడు విజయ్‌ హరి ఆకాష్‌తో, కూతురు జోవిక వ‌న‌త‌తో ఉండేలా కోర్టు ఆదేశించింది. 2007లో వనిత విజయకుమార్ వ్యాపారవేత్త ఆనంద్ జై రాజన్‌ని వివాహం చేసుకుని..జయనిత అనే మ‌రో కుమార్తెకు జ‌న్మ‌నిచ్చింది. 2012లో ఆనంద్‌, వ‌నిత మ‌న‌స్ప‌ర్థ‌ల‌తో అధికారికంగా విడాకులు తీసుకున్నారు.

ఇక 2020లో పీటర్‌ పాల్‌ అనే వ్యక్తిని వ‌నిత‌ మూడో వివాహం చేసుకోగా.. వీరి బంధం కూడా ఎక్కువ కాలం నిల‌బ‌డ‌లేదు. వ‌నిత దూరం అయ్యాక 2023లో ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో పీట‌ర్ పాల్ మృతి చెందాడు. ప్ర‌స్తుతం ఇద్ద‌రు కూతుళ్లు జోవిక‌, జ‌య‌నిత‌తో ఉంటున్న‌ వ‌నిత.. అడ‌పా త‌డ‌పా సినిమాలు చేస్తూనే సొంతంగా యూట్యూబ్ ఛానెల్ ను ర‌న్ చేస్తోంది. అయితే తాజాగా ఓ అభిమాని ప్రశ్నకు సమాధానమిస్తూ.. ఊహించని దాని కోసం ఎదురు చూడండి అంటూ వ‌నిత చెప్పుకొచ్చింది. దీంతో వ‌నిత నాలుగో పెళ్లి చేసుకోబోతోంద‌ని.. ఆమె మాట‌లకు అర్థం అదే అంటూ సోష‌ల్ మీడియాలో జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి ఈ ప్ర‌చారం ఎంత వ‌ర‌కు నిజ‌మో తెలియాలంటే మ‌రికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news