Moviesఆ హీరోతో నమిత బ్రేకప్.. సర్వం నాకి వదిలేసాడా..?

ఆ హీరోతో నమిత బ్రేకప్.. సర్వం నాకి వదిలేసాడా..?

నమిత.. ఒకప్పుడు తమిళ ప్రజల ఆరాధ్య దైవంగా మారిన హీరోయిన్ నమిత ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరంగా రాజకీయాల్లో అలాగే బుల్లితెరపై కొన్ని షోలు చేసుకుంటూ కొనసాగుతోంది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ కి ఆ హీరోతో బ్రేకప్ ఎలా అయింది.. ఉన్నదంతా ఊడ్చేసి ఆ హీరో వదిలేసాడా.. ఇంతకీ నమిత అంత గాడంగా ప్రేమించిన ఆ హీరో ఎవరో అనేది చూద్దాం. హీరోయిన్ నమిత ఒకప్పుడు ఆ హీరో తో పీకల్లోకి ప్రేమలో ఉందనే టాక్ కోలీవుడ్లో తెగ వైరల్ అయింది.ఇక ఆ హీరో ఎవరో కాదు ప్రేమిస్తే మూవీతో ఇండస్ట్రీలో ఫేమస్ అయ్యి ఓవర్ నైట్ లో స్టార్ గా పేరు తెచ్చుకున్న భరత్ కుమార్ .. అయితే ఆ హీరోతో ఓ సినిమాలో నటించే సమయంలో ఇద్దరికీ మధ్య ప్రేమ ఏర్పడి డేటింగ్ చేశారనే వార్తలు అప్పట్లో కోలీవుడ్ మీడియాలో ఎక్కువగా వైరల్ అయ్యాయి.

ఇక ఇద్దరి మధ్య రిలేషన్ బలపడడంతో నమిత తనకు వచ్చిన డబ్బులు ఇతర వ్యవహారాలన్నీ హీరో భరత్ కుమార్ కే అప్పజెప్పిందట. అలా భరత్ నమిత దగ్గర ఉన్నదంత ఊడ్చేసుకున్నారన్న పుకార్లు అయితే కోలీవుడ్ మీడియాలో వినిపించాయి. ఇక అదే సమయంలో నమితకు సినిమాల్లో అవకాశాలు తగ్గడంతో చేసేదేమీ లేక అవకాశాల కోసం కొంతమంది హీరోలతో క్లోజ్ గా ఉండడంతో ఇది చూసిన భరత్ కావాలని ఆమెతో బ్రేకప్ చెప్పుకొని విడిపోయాడట.అయితే ఆ సమయంలో తనకి అప్పజెప్పిన డబ్బు తిరిగి ఇచ్చేయమని నమిత అడగగా నువ్వు నాకు ఎక్కడ ఇచ్చావు. ఆ డబ్బులు అన్నీ నీ జల్సాలకే ఖర్చు పెట్టా.. నీది నువ్వే తీసుకున్నావు. నా దగ్గర ఒక్క రూపాయి లేదు అని మొండి చేయి చూపించాడట.

ఇక అదే సమయంలో డబ్బులు లేక అవకాశాలు లేక ఇటు ప్రేమించిన భరత్ కూడా లేకపోవడంతో చాలా డిప్రెషన్ లోకి వెళ్లిన నమిత బాధనుండి కోలుకోవడం కోసం పార్టీలు, పబ్బులు అంటూ తిరిగి చాలామందితో విమర్శలు కూడా ఎదుర్కొందట. ఇక డిప్రెషన్ లో ఉన్న సమయంలోనే ఆమెకు బుల్లితెర మీద కొన్ని అవకాశాలు వచ్చాయి. అలా కొన్ని షోలకు జడ్జిగా అలాగే ఓ సీరియల్లో కూడా చేసింది. అంతేకాకుండా రాజకీయాల్లో కూడా రాణించింది. అలాగే తమిళ బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్ గా కూడా ఎంట్రీ ఇచ్చింది.ఆ తర్వాత తనకంటే వయసులో చిన్నవాడైన బిజినెస్ మాన్ వీరేంద్ర చౌదరిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం వీరిద్దరికి కవల పిల్లలు కూడా పుట్టారు. అలా నమితను ప్రేమ పేరుతో నమ్మించి చివరికి డబ్బులు అయిపోయాక భరత్ వదిలేసాడు అని అప్పట్లో కోలీవుడ్ మీడియాలో ఎన్నో వార్తలు వినిపించాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news