Moviesఈ ఫొటోలో చిరు ఎత్తుకున్న ఇద్ద‌రు పిల్ల‌లు... ఇప్పుడు టాలీవుడ్ స్టార్...

ఈ ఫొటోలో చిరు ఎత్తుకున్న ఇద్ద‌రు పిల్ల‌లు… ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోలు.. గుర్తు ప‌ట్టారా ?

ప్రస్తుతం నడుస్తోంది అంతా సోషల్ మీడియా యుగం. ఈ సోషల్ మీడియా యుగంలో సినిమా సెలబ్రిటీల ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి. సెలబ్రిటీలకు సంబంధించి చిన్నప్పటి ఫోటోలు.. ఫ్యామిలీ ఫోటోలు.. బయటకు వస్తే ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో షేర్లు చేసుకుంటున్నారు. పై ఫోటోలో మెగాస్టార్ చిరంజీవి ఇద్దరు చిన్నపిల్లలని ఎత్తుకుని ఉన్నారు. ఏదో ఈవెంట్లో ఈ ఇద్దరు పిల్లలను చిరంజీవి ఎత్తుకున్నట్టు కనిపిస్తోంది. ఇందులో ఒక బాబు ఇంకో బాబుని బుగ్గ గిల్లుతున్నాడు.

చూడటానికి ఈ ఇద్దరు పిల్లలు చాలా క్యూట్ గా ఉన్నారు. విచిత్రం ఏంటంటే ఈ ఇద్దరు పిల్లలలో ఇద్దరు ఇప్పుడు టాలీవుడ్ లో హీరోలుగా కొనసాగుతున్నారు. ఇంత‌కు చిరంజీవి ఎత్తుకున్న ఆ ఇద్దరు పిల్లలు ఎవరో కాదు.. ఒకరు గ్లోబల్ స్టార్.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ఇంకొకరు అల్లు శిరీష్. ఎప్పుడో చిన్నప్పుడు అల్లు శిరీష్ పుట్టినరోజు వేడుకలలో చిరంజీవి వీళ్లిద్దరిని ఇలా సరదాగా ఎత్తుకున్నారు.. అప్పుడు శిరీష్ సరదాగా రామ్ చరణ్ బుగ్గ మీద గిల్లాడు అని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిసింది. దీంతో ఈ ఫోటో మరోసారి వైరల్ అవుతుంది.

ఇక రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజ‌ర్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా డిసెంబర్లో రిలీజ్ కానుంది. ఈ సినిమా తర్వాత బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించే పాన్ ఇండియా సినిమాకు ఓకే చెప్పిన సంగతి తెలిసిందే. ఇక అల్లు శిరీష్ ఆగస్టు 2 న బడ్డీ అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news