Moviesన‌య‌న‌తార డ్రీమ్ ఏంటి.. హీరోయిన్ కాక‌పోయుంటే ఏం అయ్యుండేదో తెలుసా?

న‌య‌న‌తార డ్రీమ్ ఏంటి.. హీరోయిన్ కాక‌పోయుంటే ఏం అయ్యుండేదో తెలుసా?

డయానా మరియం కురియన్ అంటే గుర్తుకురావ‌డం క‌ష్ట‌మే.. కానీ న‌య‌న‌తార అంటే మాత్రం తెలియ‌ని సినీ ప్రియులు ఉండ‌రు. సౌత్ ఫిల్మ్‌ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ అనగానే గుర్తుకు వచ్చే పేరు నయనతార. కాలేజీ రోజుల్లో పార్ట్ టైమ్ మోడల్ గా కెరీర్ ప్రారంభించిన ఆమె.. ఆ తర్వాత సినిమా రంగంలోకి అడుగు పెట్టింది. 2003లో మనస్సినక్కరే అనే మలయాళ చిత్రంతో హీరోయిన్ గా మారి అంచెలంచెలుగా ఎదిగింది.

దక్షిణాది పరిశ్రమలో అగ్ర తారగా ముద్ర వేయించుకుంది. హైయెస్ట్ పెయిడ్ యాక్ట్రెస్ గా గుర్తింపు పొందింది. గత ఏడాది జవాన్ మూవీ తో బాలీవుడ్ లోకి కూడా అడుగుపెట్టి సూపర్ సక్సెస్ అయింది. పెళ్లై ఇద్దరు పిల్లలకు తల్లి అయినా కూడా నయనతార మాత్రం బిజీ హీరోయిన్ గా సత్తా చాటుతోందంటే ఆమె క్రేజ్ ఏ రేంజ్ లో ఉదో అర్థం చేసుకోవ‌చ్చు.

అయితే చాలామందికి తెలియని విషయం ఏంటంటే.. నయనతార హీరోయిన్ అవ్వాలని ఎప్పుడూ అనుకోలేదట. అస‌లింద‌కీ ఆమె డ్రీమ్ ఏంటో తెలుసా.. చార్టర్డ్ అకౌంటెంట్ కావ‌డం. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. న‌య‌న‌తార స్వ‌స్థ‌లం కేరళలోని తిరువల్లా. ఆమె తండ్రి ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగం చేసేవారు. త‌ల్లి గృహిణి. న‌య‌న్ బాల్యం మొత్తం గుజరాత్ లోని జామ్ నగర్‌లో గ‌డిచిపోయింది. తండ్రి రిటైర్ అయ్యాక న‌య‌న‌తార ఫ్యామిలీ సొంతూరుకి వెళ్లి సెటిల్ అయ్యారు.

ఇంగ్లీష్ లిటరేచర్ లో బి.ఏ చ‌దువుకున్న న‌య‌న‌తార‌.. చార్టర్డ్ అకౌంటెంట్ కావాలనుకుంది. కానీ విధి ఆమెను ఇండ‌స్ట్రీ వైపు అడుగులు వేసేలా చేసింది. న‌య‌న‌తార పెద్ద నాన్నకు ఒక యాడ్ ఏజెన్సీ ఉండేది. ఆయ‌న త‌ర‌చూ న‌య‌న‌తార ఫోటోలు తీసి ఇతర ఏజెన్సీలకు పంపిస్తూ ఉండేవారు. అయితే మలయాళీ దర్శకుడు సత్యన్ అంతిక్కండ్ ఓసారి న‌య‌న‌తార ఫోటోలు చూశారు. లుక్స్ బాగుండ‌టంతో ఆమెకు మనస్సినక్కరే మూవీలో హీరోయిన్ ఛాన్స్ ఇచ్చారు. వెతుక్కుంటూ సినిమా అవ‌కాశం రావ‌డంతో న‌య‌న‌తార ఓకే చెప్పి గ్లామ‌ర్ ఫిల్డ్‌ లోకి ప్ర‌వేశించింది. అయితే హీరోయిన్ కాక‌పోయుంటే మాత్రం క‌చ్చితంగా తాను ప్రొఫెషనల్ చార్టర్డ్ అకౌంటెంట్ అయ్యేదాన్న‌ని రీసెంట్ గా ఓ ఇంట‌ర్వ్యూలో న‌య‌న‌తార స్వ‌యంగా పేర్కొంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news