టాలీవుడ్ లో రెండో పెళ్లిళ్లు.. విడాకుల గురించి మాట్లాడుకోవాలంటే ముందుగా అక్కినేని ఫ్యామిలీ.. ఆ తర్వాత మెగా ఫ్యామిలీ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అక్కినేని ఫ్యామిలీలో నాగచైతన్య – సమంత ప్రేమించి రెండు మత సంప్రదాయాలు ప్రకారం ఎంతో వైభవంగా పెళ్లి చేసుకున్నారు. అసలు నాగచైతన్య సమంత పెళ్లి అనేది టోటల్ భారతీయ సినీ పరిశ్రమలోనే పెద్ద సంచలనం అయింది. నాలుగేళ్లు కూడా కాపురం చేయకుండానే మనస్పర్ధలు నేపథ్యంలో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు.
నాగచైతన్య తండ్రి కూడా చైతు పుట్టాక చైతు తల్లి శ్రీలక్ష్మికి విడాకులు ఇచ్చేసిన సంగతి తెలిసిందే. ఇక అదే ఫ్యామిలీలో మరో హీరో సుమంత్ సైతం హీరోయిన్ కీర్తి రెడ్డి ని ప్రేమ వివాహం చేసుకొని ఏడాదికే విడాకులు ఇచ్చేశాడు. ఇక సుమంత్ చెల్లి యార్లగడ్డ సుప్రియ వైవాహిక జీవితం సైతం అనుకూలంగా సాగలేదు. ఇక అదే అక్కినేని ఫ్యామిలీలో అక్కినేని నాగార్జున రెండో కుమారుడు అఖిల్ కు శ్రీయాభూపాల్తో ఎంగేజ్మెంట్ జరిగాక పెళ్లి క్యాన్సిల్ అయ్యింది.
ఇక నాగార్జున నాగచైతన్య పుట్టాక శ్రీలక్ష్మికి విడాకులు ఇచ్చేశాక సినిమాలో యాక్టివ్ అయ్యారు. ఈ క్రమంలోనే తోటి హీరోయిన్ అమలతో ప్రేమలో పడి ఆమెను పెళ్లి చేసుకుంటానని నాగేశ్వరరావు తో చెప్పారట. ఏఎన్ఆర్ చెప్పినా వినకుండా నాగార్జున.. అమలని పెళ్లి చేసుకున్నాడు.. ఇది నచ్చని నాగేశ్వరరావు నాగార్జునని ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మన్నారట.. కొన్నాళ్లపాటు తండ్రీకొడుకులు ఇద్దరికీ మాటలు కూడా లేవన్న ప్రచారం అప్పట్లో టాలీవుడ్ లో వినిపించింది.
అయితే సీనియర్ నటుడు మురళీమోహన్ కలుగజేసుకొని నాగేశ్వరరావుతో మాట్లాడి అన్నపూర్ణ స్టూడియో బాధ్యతలు ఉన్నాయి.. అవన్నీ చూసుకోవాల్సిందే నాగార్జున కదా.. పైగా మీ సినిమా వారసుడు ఇంతకుముందు పెళ్లి మీ ఇష్ట ప్రకారం జరిగింది అది నిలవలేదు కదా.. ఈసారి తన ఇష్టానికి వదిలేయండి కొడుకుని దగ్గరికి తీసుకోమని విజ్ఞప్తి చేశారట. అలా ఏఎన్ఆర్ కి నాగార్జున కి వచ్చిన గ్యాప్ ను మురళీమోహన్ ఫిల్ చేశారని.. అక్కినేని ఫ్యామిలీ గురించి తెలిసిన వారు చెబుతూ ఉంటారు.