విక్టరీ వెంకటేష్ హీరోగా టాలీవుడ్ లో వచ్చిన ప్రేమించుకుందాం రా.. సినిమా ఎంత పెద్ద సంచలనం క్రియేట్ చేసిందో తెలిసిందే. 1997లో వచ్చిన ఈ సినిమా టాలీవుడ్లో ఫ్యాక్షన్ సినిమాలకు బీజం వేసింది. ఈ సినిమాతో జయంత్ దర్శకుడుగా పరిచయం అయ్యారు. వాస్తవంగా ఈ సినిమా కంటే ముందు ఆయన సురేష్ ప్రొడక్షన్స్‌లో ఒక సినిమా చేయాల్సి ఉంది. రామానాయుడు కూడా జయంత్‌కు నిన్ను దర్శకుడిని చేస్తాను అని మాట ఇచ్చారు. ఆ ఛాన్స్ ఎందుకో మిస్ అయింది.. అప్పటికే సురేష్ ప్రొడక్షన్స్ సంస్థలో పలు సినిమాలకు కో డైరెక్టర్‌గా పనిచేసిన జయంత్ అంటే రామానాయుడుకి, సురేష్ బాబుకి మంచి అభిప్రాయం ఉంది.
ఈ క్రమంలోనే కచ్చితంగా హిట్ ఇస్తాడని నమ్మకం కలిగింది. అందుకే ఏకంగా తమ హీరో వెంకటేష్‌తో సినిమా చేసే అవకాశం ఇచ్చారు. తొలి ప్రయత్నంలోనే జయంత్ ప్రేమించుకుందాం రా.. సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడు. ప్రేమ కథకు.. ఫ్యాక్షన్ నేపథ్యం జతచేసి తెరకెక్కించిన ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో పాటు.. కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ సినిమా విక్టరీ వెంకటేష్ కెరీర్లోనే టాప్ టెన్ సినిమాలలో ఒకటిగా నిలిచింది. ఈ సినిమాతోనే బాలీవుడ్ ముద్దుగుమ్మ అంజలా ఝవేరి.. టాలీవుడ్‌కు హీరోయిన్గా పరిచయం అయింది.
ప్రేమించుకుందాం రా.. సినిమాలో పెద్ద ప్లస్ పాయింట్ అంజలా ఝవేరి. ఈ బ్యూటీ చేసిన స్కిన్ షోకి థియేటర్లలో జనాలు ఈలలు, కేకలతో దద్దరిల్లిపోయేలా చేశారు. మరీ ముఖ్యంగా సూర్య కిరీటమే సాంగ్‌లో అంజలా చేసిన అందాల ప్రదర్శన.. అప్పట్లో కుర్రకారుకు మంచి కిక్ ఇచ్చింది. లంగా ఓణీలో కూడా ఆమె కొంటె చూపులు.. ఆమె తొలి యవ్వనపు సౌందర్యం.. తెలుగు కుర్రకారును ఒక రేంజ్లో ఆకట్టుకుంది. సినిమాలో ట్రెడిషనల్‌గా, గ్లామర్ పరంగా, అంజలా ఝవేరి కాక రేపింది. ఈ సినిమా చూసిన తర్వాతే అంజలా అందానికి తెలుగు దర్శక, నిర్మాతలు, హీరోలు ఫిదా అయ్యారు. అలా ఆమెకు మెగాస్టార్ చిరంజీవి చూడాలని ఉంది. బాలయ్యకు జోడిగా సమరసింహారెడ్డి సినిమాలలో అవకాశాలు వచ్చాయి.