ప్రస్తుత రోజుల్లో టాక్ ఎంత బాగున్నా సినిమా సక్సెస్‌ఫుల్ గా నెల రోజులు ఆడటం అనేది ఎంతో క్లిష్టతరంగా మారింది. ఒకవేళ టాక్ నెగటివ్ గా వస్తే.. వారం రోజులకే ఆ సినిమాను థియేటర్స్ నుంచి లేపేస్తున్నారు. అలాంటిది ఫ్లాప్ టాక్ వచ్చినా కూడా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో రెండు సినిమాలు 100 ఆడాయంటే నమ్ముతారా.. మీరు నమ్మకపోయినా అది నిజం.
ఫ్లాప్ టాక్ తో 100 రోజులు ఆడిన మహేష్ చిత్రాల్లో ఖలేజా ఒకటి. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్ట్ చేసిన ఫాంటసీ యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. ఈ సినిమాలో మహేష్ బాబు, అనుష్క శెట్టి జంటగా నటించారు. ప్రకాష్ రాజ్ ప్రతినాయకుడి పాత్రను పోషించాడు. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మితమైన ఖలేజా చిత్రం భారీ అంచనాల నడుమ 2010 అక్టోబర్ 17న విడుదలైంది.
అయితే ప్రేక్షకులను మిశ్రమ స్పందన లభించడంతో.. బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ గా ఖలేజా ఫ్లాప్ అయింది. కానీ చిత్తూరులోని శ్రీనివాస థియేటర్‌లో ఖలేజా చిత్రం వంద రోజులు అడి రికార్డు సెట్ చేసింది. అలాగే టీవీల్లో కూడా ఈ సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.
ఇక మహేష్ బాబు కెరీర్ లో ఫ్లాప్ టాక్ తో వంద రోజుల ఆడిన మరో చిత్రం స్పైడర్. సైకో కిల్లర్ కాన్సెప్ట్ తో కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ ఎ.ఆర్.మురగదాస్ తెరకెక్కించిన ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా యాక్ట్ చేసింది. 2017 సెప్టెంబర్ 27న విడుదలైన ఈ సినిమా కమర్శియల్‌గా పరాజయం పాలైనప్పటికీ.. నెల్లూరు లోని రామరాజు థియేటర్‌లో 100 రోజులు ఆడింది.