సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. ఉమనైజర్ అన్న టాక్ ఉంది. హీరోయిన్లు, అమ్మాయిలు, మహిళల విషయంలో వర్మ చేసే కామెంట్లు ఎంత జగుస్సాకరంగా, ఎంత అసభ్యకరంగా ఉంటాయో తెలిసిందే. ఇక మహిళా యాంకర్లు, హీరోయిన్లతో ఇటీవల కాలంలో వర్మ ఎంత దారుణంగా బిహేవ్ చేస్తున్నాడో కూడా చూస్తూనే ఉన్నాం. తెలుగులో అక్కినేని నాగార్జునతో.. వర్మ తెరకెక్కించిన తొలి సినిమా శివ.
ఆ సినిమా అప్పట్లో ఇండస్ట్రీని ఒక కుదుపు కుదిపేసింది. ఈ సినిమాలో పరిచయంతో అక్కినేని నాగార్జున అమలను నిజజీవితంలో వివాహం చేసుకున్నారు. వాస్తవానికి ఈ సినిమాలో శ్రీదేవిని హీరోయిన్గా పెట్టి చేయాలని అనుకున్నాడట వర్మ. శ్రీదేవి బిజీగా ఉండడంతో కుదరలేదు. ఇదిలా ఉంటే వర్మ కెరీర్ ప్రారంభం నుంచి కూడా శ్రీదేవిని ఎంతో ఇష్టపడ్డాడు. ఎన్టీఆర్ పక్కన శ్రీదేవి సినిమాలలో నటిస్తున్నప్పటినుంచి ఆమెపై మనసు పారేసుకున్నాడు.
అయితే శ్రీదేవికి కూడా వర్మ తనకు లైన్ వేస్తున్నాడని తెలుసట. వర్మ కూడా తాను శ్రీదేవిని ప్రేమిస్తున్న విషయాన్ని ఆమెకు నేరుగా చెప్పకపోయినా.. ఆమె చుట్టూ ఉండే వాళ్లకి తెలిసేలా చేసేవాడట. అందుకే వర్మతో కెరీర్ ప్రారంభంలో కొన్ని సినిమాలలో నటించినా శ్రీదేవి.. వర్మ తనను ప్రేమిస్తున్న విషయం తెలిశాక వర్మ సినిమాలు ఒప్పుకోలేదు. శ్రీదేవికి ఈ విషయం తెలిసిన ఎక్కడా బయటపడలేదు. ఇక వర్మ, శ్రీదేవి కాంబినేషన్లో తెలుగులో క్షణక్షణం, గోవిందా.. గోవిందా సినిమాలు వచ్చాయి.