కమెడియన్ నుంచి హీరోగా మారిన ప్రియదర్శి.. మల్లేశం, బలగం, సేవ్ ద టైగర్స్ వంటి క్రేజీ ప్రాజెక్ట్స్ తో ప్రేక్షకులను అలరిస్తూ ఫుల్ స్వింగ్ లో దూసుకుపోతున్నాడు. తన మార్కెట్ ను మెల్లమెల్లగా పెంచుకుంటున్నాడు. ఇదే తరుణంలో ప్రియదర్శి కథానాయకుడిగా నటించి లేటెస్ట్ ఫిల్మ్ డార్లింగ్ పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. హనుమాన్ వంటి పాన్ ఇండియా హిట్ అనంతరం ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మించిన డార్లింగ్ మూవీకి అశ్విన్ రామ్ దర్శకత్వం వహించాడు.
నభా నటేష్ ఈ సినిమాలో హీరోయిన్ గా.. మల్టిపుల్ స్ప్లిట్ పర్సనాలిటీ డిజార్డర్ ఉన్న క్యారెక్టర్ లో యాక్ట్ చేశారు. టీజర్, ట్రైలర్స్ ద్వారా హైప్ తెచ్చుకున్న డార్లింగ్ మూవీ జులై 19న విడుదలైంది. కానీ ప్రేక్షకులను మెప్పించడంలో పూర్తిగా విఫలం అయింది. మెజారిటీ పీపుల్ నుంచి ఫ్లాప్ టాక్ ను మూటగట్టుకుంది. దీంతో ప్రముఖ టాలీవుడ్ హీరో అల్లరి నరేష్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
అయితే అల్లరి నరేష్ సంతోష పడేది.. డార్లింగ్ ఫ్లాప్ అయినందుకు కాదు, తాను ఈ సినిమా నుంచి తప్పించుకున్నందుకట. 2018లో దర్శకుడు అశ్విన్ రామ్ డార్లింగ్ కథ ప్రియదర్శికి చెప్పాడు. అప్పటికి ప్రియదర్శికి హీరోగా మార్కెట్ లేదు. ఆ తర్వాత స్టోరీ అల్లరి నరేష్ దగ్గరికి వెళ్ళింది. రాజేష్ దండా నిర్మాణంలో ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ సెట్ అయింది. కానీ లాస్ట్ మినిట్ గా అల్లరి నరేష్ డ్రాప్ అయ్యారు.
ఫుల్ స్క్రిప్ట్ చదివాక ఆయనకు సెకండాప్ నచ్చలేదు. డైరెక్టర్ అశ్విన్ రామ్ కొన్ని మార్పులు చేసినా కూడా అల్లరి నరేష్ సంతృప్తి చెందలేదు. సినిమా ఫలితాన్ని ముందే ఊహించిన అల్లరి నరేష్ తెలివిగా సైడ్ అయ్యారు. కానీ ప్రియదర్శి బుక్ అయ్యాడు. కథ తిరిగి తిరిగి మళ్లీ ప్రియదర్శి వద్దకే రావడంతో డార్లింగ్ పట్టాలెక్కింది. చివరకు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది.