మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన తొలి చిత్రం మగధీర. ఇదొక రొమాంటిక్ ఫాంటసీ యాక్షన్ మూవీ. విజయేంద్ర ప్రసాద్ అందించిన కథతో రాజమౌళి ఈ సినిమాను తెరక్కించారు. అప్పటి వరకు తెలుగు సినిమా మార్కెట్ అంటే 40 కోట్లే. పోకిరి సినిమా 40 కోట్లు వసూల్ చేసిందంటే ఎంతో వింతంగా చెప్పుకున్నారు. అలాంటి సమయంలో ఏకంగా రూ. 45 కోట్లు బడ్జెట్ పెట్టి గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ మగధీర చిత్రాన్ని నిర్మించారు.
రామ్ చరణ్ కు జోడిగా కాజల్ అగర్వాల్ యాక్ట్ చేసింది. శ్రీహరి, దేవ్ గిల్, రావు రమేష్ తదితరులు ఇతర ముఖ్యమైన పాత్రలను పోషించగా.. ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. 2009లో భారీ అంచనాల నడుమ విడుదలైన మగధీర చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. కమర్షియల్ గా ఘన విజయాన్ని నమోదు చేసింది. రూ. 128 కోట్లకు పైగా కలెక్షన్స్ ను రాబట్టి టాలీవుడ్ రూపు రేఖలు మార్చేసింది. ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.
1000 రోజుల థియేట్రికల్ రన్ పూర్తి చేసుకున్న అది కొద్ది చిత్రాల్లో మగధీర కూడా ఒకటి. అలాగే హిందీలోకి అదే పేరుతో, తమిళంలో మావీరన్గా మరియు మలయాళంలోకి ధీర : ది వారియర్‌గా డబ్ చేసి విడుదల చేయగా.. ఆయా భాషల్లో సైతం మగధీర సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాతో రామ్ చరణ్, కాజల్ అగర్వాల్ భారీ స్టార్డమ్ ను సంపాదించుకున్నారు. రాజమౌళి సత్తా ఏంటో కూడా అందరికీ తెలిసింది.
ఇకపోతే ఈ చిత్రానికి మొదట అనుకున్న టైటిల్ మగధీర కాదట. మొదట ఒక టైటిల్ అనుకోవడం.. ఆ తర్వాత వేరే టైటిల్ పెట్టడం ఇండస్ట్రీలో తరచూ జరిగేదే. మగధీర మూవీ విషయంలోనూ ఇదే జరిగింది. రామ్ చరణ్ తో చేయబోయే చిత్రం కోసం డైరెక్టర్ రాజమౌళి ముందుగా డేగ అనే టైటిల్ ను పరిశీలించారట. కానీ టీమ్ లో కొందరు ఆ టైటిల్ పెద్దగా సెట్ కాలేదని చెప్పారట. దాంతో రాజమౌళి బాగా ఆలోచించి ఫైనల్ గా మగధీర టైటిల్ ను ఫిక్స్ చేయడం జరిగింది.