మెగా హీరో సాయిధరమ్ తేజ్ టాలీవుడ్ లోకి మెగా ఫ్యామిలీ వారసత్వంతో అడుగుపెట్టారు. మెగాస్టార్ మేనల్లుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈయన నటించిన సినిమాలు హిట్టవడంతో ప్రస్తుతం స్టార్ హీరో రేస్ లో కొనసాగుతున్నారు. ఇక ఆ మధ్యకాలంలో ఆయన యాక్సిడెంట్ అవ్వడం వల్ల కొద్దిరోజులు ఇంటిపట్టునే ఉన్నప్పటికీ మళ్లీ విరూపాక్ష సినిమాతో గ్రాండ్ కం బ్యాక్ ఇచ్చారు. ప్రస్తుతం ఈయన గంజా శంకర్ సినిమాలో చేస్తున్నప్పటికీ ఈ సినిమా షూటింగ్ కొన్ని కారణాల వల్ల వాయిదా పడ్డట్టు తెలుస్తోంది. అలాంటి సాయి ధరమ్ తేజ్ కి ఒక స్యాడ్ లవ్ స్టోరీ ఉంది.
మరి ఇంతకీ సాయి ధరమ్ తేజ్ ప్రేమించిన ఆ అమ్మాయి ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం.. ప్రతి ఒక్కరికి ఫస్ట్ లవ్ అనేది కచ్చితంగా ఉంటుంది. అయితే అందరిలాగే సాయి ధరంతేజ్ కి కూడా చదువుకునే రోజుల్లో ఓ అమ్మాయి తో పీకల్లోకి ప్రేమలో మునిగి పోయారట. అది కూడా ఇంటర్ చదివే రోజుల్లోనే. అలా ఇంటర్ 2 ఇయర్స్ అమ్మాయి తో ప్రేమాయణం కొనసాగించాక డిగ్రీలో కూడా తమ లవ్ ని అలాగే కంటిన్యూ చేశారట. అయితే చివరికి డిగ్రీ అయిపోయే సమయానికి ఆ అమ్మాయికి పెళ్లి సెట్ అయింది.
అయితే సాయి ధరమ్ తేజ్ ని పెళ్లి చేసుకోమని అడిగితే ఇప్పుడు నా దగ్గర నిన్ను పోషించడానికి డిగ్రీ పట్టా తప్పా మరే ఉద్యోగం లేదు. ఇప్పటికి నేను సెట్ అవ్వలేదు. నీకు మీ పేరెంట్స్ చూసిన సంబంధమే బాగుంటుంది కచ్చితంగా నిన్ను ఆ వ్యక్తి బాగా చూసుకోవాలని నేను కోరుకుంటున్నాను. నేను లైఫ్ లో ఇప్పుడే సెట్ అవ్వలేదు సెట్ అయ్యేవరకు మీ పేరెంట్స్ నీకు పెళ్లి చేయకుండా ఉండలేరు అందుకే మన ప్రేమను ఇక్కడితో వదిలేసి ఆ అబ్బాయిని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండు అని చెప్పారట.
ఇక ఎంతో గాఢంగా ప్రేమించిన ప్రియురాలికి ఈ విషయం చెప్పడమే కాదు దగ్గరుండి మరీ ఆమె పెళ్లి జరిపించారట.ఎందుకంటే వీరందరూ ఫ్రెండ్స్ కాబట్టి ఆ పెళ్లిలో సాయి ధరమ్ తేజ్ దగ్గరుండి అన్ని పనులు చూసుకున్నారట. అలా కళ్ళముందే తాను ప్రేమించిన అమ్మాయి మరో వ్యక్తికి భార్య అవ్వడం చూసి ఆరోజు సాయి ధరమ్ తేజ్ తట్టుకోలేకపోయారట. కానీ ఆమెను పెళ్లి చేసుకొని పోషించలేక ఇబ్బంది పెట్టే కంటే వేరే వ్యక్తి పెళ్లి చేసుకొని ఆమె సుఖంగా ఉంటే చాలు అనుకున్నారట.
ఇక ఈ ఒక్క ఫెయిల్యూర్ లవ్ స్టోరీ మాత్రమే కాదు. ఆయన సినిమాల్లోకి వచ్చిన సమయంలో తిక్క మూవీలో తనతో పాటు నటించిన లారీస్సా బోనేసి ని కూడా ప్రేమించారు. కానీ ఆ హీరోయిన్ కి ముందే లవర్ ఉన్నాడని తెలిసి డ్రాప్ అయిపోయాడట. ఇక ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ హీరోయిన్ రెజీనాతో ప్రేమలో ఉన్నట్టు తెలుస్తోంది.