Moviesనీ కూతుర్ని లేపుకెళ్తా.. ఆ వ్యక్తికి అల్లు అర్జున్ మాస్ వార్నింగ్..?

నీ కూతుర్ని లేపుకెళ్తా.. ఆ వ్యక్తికి అల్లు అర్జున్ మాస్ వార్నింగ్..?

నీ కూతుర్ని లేపుకెళ్తా అని అల్లు అర్జున్ అన్నారంటే మీరందరూ సినిమాలో ఆయన డైలాగ్ కావచ్చు అనుకుంటారు. అయితే ఇదేదో సినిమా డైలాగ్ కాదు స్వయంగా అల్లు అర్జున్ సినిమాల్లోకి రాకముందు ఓ పెద్దమనిషిని బెదిరించింది. మరి ఇంతకీ అల్లు అర్జున్ బెదిరించిన ఆ పెద్దమనిషి ఎవరు..ఎందుకు ఆయనకు వార్నింగ్ ఇచ్చారు అనేది ఇప్పుడు చూద్దాం.. అల్లు అర్జున్ చిన్నప్పటినుండి చాలా అల్లరి పనులు చేసేవారట. ఈ విషయాన్ని అల్లు అరవింద్ తో పాటు అల్లు అర్జున్ కూడా ఎన్నో ఇంటర్వ్యూలో బయట పెట్టారు. ఇక అలా అల్లరితనం వయసు పెరిగినా కొద్దీ తగ్గుతుందిలే అనుకున్నారట. కానీ ఆ అల్లరితనం అల్లు అర్జున్ వయసుతో పాటు పెరిగి పోయిందట.

ఇక డాన్స్ అంటే పిచ్చి ఇష్టం ఉన్న అల్లు అర్జున్ డాన్స్ మీద యాక్టింగ్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టి స్టడీస్ మీద తక్కువ ఫోకస్ పెట్టేవారట. అలా ఇంటర్ చదువుతున్న సమయంలో ఆయనకు తక్కువ మార్కులు రావడంతో ప్రిన్సిపాల్ మీ డాడీని రమ్మను ఇవేం మార్కులు అంటూ తిట్టారట. దాంతో మరునాడు అల్లు అరవింద్ ని కాలేజీకి రమ్మని చెప్పారట. ఇక అల్లు అర్జున్ ఏం తప్పు చేశాడో తెలియని అల్లు అరవింద్ హడావిడిగా కాలేజీకి వచ్చి ప్రిన్సిపల్ రూమ్ కి వెళ్ళాక ప్రిన్సిపల్ ఏమీ అనకుండా సైలెంట్ గా మార్కుల లిస్టు తీసి ఆయనకు ఇచ్చారట. అయితే అల్లు అర్జున్ చేసే వెదవ పనులకు తనకు ఎన్ని తిట్లు ఉంటాయో అని భయపడుకుంటూ ప్రిన్సిపల్ రూమ్ కి వెళ్లిన అల్లు అరవింద్ కి ఎలాంటి తిట్లు పడలేదు.

దానికి ప్రధాన కారణం అరవింద్ ప్రిన్సిపల్ రూమ్ కి వెళ్లే ముందే అల్లు అర్జున్ ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్లి సినిమా రేంజ్ లో డైలాగ్ చెప్పారట. మీరు నా గురించి నా చదువు గురించి మా డాడీ దగ్గర ఏదైనా వాగితే మాత్రం మీకు ఓ కూతురు ఉంది కదా..ఆమెను లేపుకెళ్లి మీ పరువు తీస్తాను అంటూ వార్నింగ్ ఇచ్చారట. అయితే అప్పటికే ఇండస్ట్రీలో ఎంతో పేరున్న ఫ్యామిలీ కాబట్టి ప్రిన్సిపల్ కూడా అల్లు అర్జున్ వార్నింగ్ కి హడలి పోయారట. దాంతో అల్లు అరవింద్ వచ్చాక ఏమి మాట్లాడకుండా సైలెంట్ గా ఉన్నారట. అయితే ఈ విషయాన్ని స్వయంగా అల్లు అరవింద్ ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు. అలా కాలేజ్ డేస్ లోనే అల్లు అర్జున్ తన మాస్ డైలాగ్స్ తో అందర్నీ బెదిరించే వారట.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news