భారతీయ సినీ పరిశ్రమలో ఉన్న అత్యంత సంపన్న హీరోల్లో అక్కినేని నాగార్జున ఒకరు. ఏఎన్ఆర్ గారి తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నాగార్జున.. నటుడుగానే కాకుండా నిర్మాతగా, హోస్ట్ గా, అన్నపూర్ణ స్టూడియోస్ అధినేతగా, వ్యాపారవేత్తగా సూపర్ సక్సెస్ అయ్యారు. వందల కోట్ల ఆస్తులు కూడబెట్టారు. కానీ ఏం లాభం ఒక విషయంలో మాత్రం ఇప్పటికీ నాగార్జున బాధపడతారట.
నాగార్జునకు రెండు వివాహాలు ఆయన సంగతి మనందరికీ తెలిసిందే. మొదట దగ్గుపాటి రామానాయుడు గారి కూతురు, విక్టరీ వెంకటేష్ సోదరి దగ్గుబాటి లక్ష్మీని నాగార్జున పెళ్లి చేసుకున్నారు. నాగ చైతన్య పుట్టిన తర్వాత మనస్పర్ధలతో వీరు విడిపోయారు. ఆ తర్వాత లక్ష్మి ఒక వ్యాపారవేత్తను వివాహం చేసుకొని చెన్నైలో సెటిల్ అవ్వగా.. నాగార్జున తన సహనటి అమలను ప్రేమించి పెళ్లాడారు. అయితే పెళ్లి తర్వాత ఒక కూతురిని కనాలని నాగార్జున ఎంతగానో ఆశపడ్డారట. ఇంతలోనే అమల గర్భం దాల్చింది.
ట్రీట్మెంట్ బాగుంటుందనే ఉద్దేశంతో డెలివరీకి 6 నెలల ముందే అమలను యూఎస్ పంపించారు. అయితే యూఎస్ లో డాక్టర్లు అమలకు స్కానింగ్ చేసి ఆడపిల్ల అని చెప్పారట. దాంతో నాగార్జున ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆడపిల్లను కనాలనే తన కోరిక నెరవేరబోతోందని నాగార్జున తెగ సంబరం పడిపోయారు. అంతేకాదు పుట్టబోయే బిడ్డకు నిఖిత అని పేరు పెట్టాలని ఫిక్స్ అయ్యారు. అమ్మాయి కోసం బట్టలు కొనేశారు. రిటర్న్ టికెట్ నిఖిత పేరు మీద బుక్ చేశారు.
కానీ చివరికి అమల అబ్బాయికి జన్మనిచ్చింది. ఆ అబ్బాయే అఖిల్. కొడుకు పుట్టడంతో నాగార్జున షాక్ అయ్యారు. డాక్టర్లు అమ్మాయి పుడుతుందని ఎందుకు చెప్పారో ఆరా తీస్తే.. స్కానింగ్ రిపోర్ట్ లో తప్పు రావడానికి 5 శాతం ఛాన్స్ ఉందని అన్నారట. దాంతో అబ్బాయి పుట్టినందుకు ఆనందపడాలో.. అమ్మాయి పుట్టనందుకు బాధపడాలో నాగార్జునకు అర్థంకాలేదు. ఇక ఆ తర్వాత అమ్మాయి కోసం ప్రయత్నిద్దామని నాగార్జున అడగగా.. అందుకు అమల ఒప్పుకోలేదు. అలా అమ్మాయిని కనాలనే నాగార్జున కోరిక తీరకుండానే పోయింది.