Moviesస్టార్ హీరోయిన్లపై శ్రీ రెడ్డి షాకింగ్ కామెంట్స్.. వాళ్ల మొహాలు అస్సలు...

స్టార్ హీరోయిన్లపై శ్రీ రెడ్డి షాకింగ్ కామెంట్స్.. వాళ్ల మొహాలు అస్సలు చూడలేమంటూ..!

వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉండే శ్రీ రెడ్డి హీరోయిన్ అవుదామని ఎన్నో కలలు కని ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. అలా ఇండస్ట్రీ లోకి వచ్చిన కొత్తలో ఓ రెండు మూడు సినిమాల్లో కనిపించింది.అయితే ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది తనని వాడుకొని సినిమా అవకాశం ఇస్తానని చెప్పి చివరికి హ్యాండ్ ఇచ్చారట. దాంతో శ్రీ రెడ్డి బహిరంగంగానే వారి పేర్లు బయట పెడుతూ వారిపై సంచలనం వ్యాఖ్యలు చేసింది.మరీ ముఖ్యంగా దగ్గుబాటి సురేష్ బాబు చిన్న కొడుకు దగ్గుబాటి అభిరామ్ పేరు శ్రీ రెడ్డి వ్యవహారంలో ఎక్కువ వైరల్ అయింది.

అంతేకాకుండా శ్రీరెడ్డి అభిరామ్ తో దిగిన ప్రైవేట్ ఫొటోస్ కూడా లీక్ చేసి మీడియాలో దుమారం సృష్టించింది. ఇప్పటికీ ఆ ఫొటోస్ నెట్టింట్లో లో చక్కర్లు కొడుతూనే ఉంటాయి. ఇదిలా ఉంటే హీరోయిన్ అవుదామని వచ్చిన శ్రీరెడ్డిని వాడుకుని వదిలేయడంతో ఆమె మీడియాలో రచ్చ రచ్చ చేసింది.దాంతో ఆమెను టాలీవుడ్ ఇండస్ట్రీ బ్యాన్ చేసింది. అంతేకాకుండా కొంతమంది ప్రముఖ కుటుంబాలను టార్గెట్ చేస్తూ మాట్లాడంతో ఆమెకు సినిమాల్లో అవకాశాలు కూడా ఇవ్వడం లేదు. ఇక సినిమాల్లో నటించకపోయినప్పటికీ సోషల్ మీడియా ద్వారా చాలా యాక్టివ్ గా ఉంటూ ఎన్నో విషయాల్లో స్పందిస్తూ ఉంటుంది.

అయితే ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీరెడ్డి స్టార్ హీరోయిన్ల గురించి మాట్లాడుతూ వారి అందంపై షాకింగ్ కామెంట్స్ చేసింది. శ్రీరెడ్డి మాట్లాడుతూ. ఒకరిని విమర్శించడం అనేది మంచిపని కాదు. మన ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు ఉన్నారు. వారందరూ బాగుంటారా.. ఉదాహరణకు సమంత బాడీలో అసలు అట్రాక్టివ్ గా టెంప్ట్ అయిపోయేంత అందం ఏమీ ఉండదు. ఇక నిత్యమీననేమో ఇంతే అంటే చిన్నగా ఉంటుంది. అలాగే రకుల్ ప్రీత్ సింగ్ ని చూస్తే మాత్రం అసలు అబ్బాయిని చూస్తున్నామా.. అమ్మాయిని చూస్తున్నామా.. అనేది కూడా అర్థం కాదు. ఇక తమన్నా బొడ్డున తప్ప మొహం అస్సలు చూడలేం అంటూ మాట్లాడింది.

అయితే ఈ హీరోయిన్ల పేర్లు చెబుతున్నానని తప్పుగా అనుకోకండి. ఎందుకంటే ఏ హీరోయిన్ అయినా సరే ఏ వ్యక్తి అయినా సరే పర్ఫెక్ట్ స్ట్రక్చర్ ని కలిగి ఉండరు. వారిలో ఏదో ఒకటి తక్కువగానే ఉంటుంది. అయితే వారికి ప్రొడ్యూసర్లు,దర్శకులు అవకాశాలు ఇస్తున్నారు. ఇక మనం వాళ్లు ఇష్టం లేకపోయినా కూడా మనకు నచ్చిన హీరో కోసం, కథల కోసం వెళ్లి సినిమా చూసి దాన్ని హిట్ చేస్తున్నాం. అంతమాత్రాన వాళ్ళందరూ అందగత్తెలని కాదు.అలాగే తమిళ్ ఇండస్ట్రీలో అయితే హీరోయిన్స్ అస్సలు బాగుండరు.డీ గ్లామరస్ లుక్ లోనే ఉంటారు. అయినప్పటికీ అందులో కంటెంట్ ఉండడం వల్ల సినిమాలు బ్లాక్ బస్టర్ అవుతాయి అంటూ శ్రీరెడ్డి చెప్పింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news