టాలీవుడ్ ఇండస్ట్రీలో అడివి శేష్ అంటే తెలియని వారు ఉండరు. ఈయన మేజర్, గూఢచారి, క్షణం, హిట్ -2 వంటి సినిమాలతో ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్నారు. ఇక గతంలో కూడా పంజా, బాహుబలి వంటి సినిమాల్లో చేసినప్పటికీ మేజర్ సినిమా ఈయనకు ఎక్కడలేని స్టార్డంని తెచ్చిపెట్టింది.దాంతో మంచి కంటెంట్ ఉన్న కథలని ఎంచుకుంటూ ఇండస్ట్రీలో హీరోగా నిలదొక్కుకున్నారు. అయితే అలాంటి అడివి శేష్ 40 ఏళ్ళు దగ్గర పడుతున్నా ఇంకా పెళ్లి చేసుకోవడం లేదు. ఇక గత కొద్ది రోజులుగా అడివి శేష్ పై ఇండస్ట్రీలో ఓ రూమర్ చక్కర్లు కొడుతోంది. ఓ పెద్దింటి అమ్మాయితో ఈయన ప్రేమలో ఉన్నారని వినిపిస్తోంది.
కానీ అది ఎంతవరకు నిజం అనేది మాత్రం తెలియదు. ఇక ఓ ఇంటర్వ్యూలో అడివి శేష్ నాకు రిలేషన్స్ ఉన్నాయి. కానీ వాటిని పెళ్లి వరకు తీసుకువెళ్లాలంటే భయమేస్తోంది.ఎందుకంటే పెళ్లి చేసుకున్న చాలామంది హ్యాపీగా లేరు. అందుకే ఆ రిలేషన్స్ ని పెళ్లి వరకు తీసుకువెళ్లడం లేదు అని చెప్పారు. అంతేకాకుండా అదే ఇంటర్వ్యూలో తన హార్ట్ బ్రేక్ అయిన బ్రేకప్ లవ్ స్టోరీ కూడా చెప్పారు. అడివి శేష్ యుఎస్ లో ఉన్న సమయంలో ఓ అమ్మాయిని చాలా గాఢంగా ప్రేమించారట. ఆ అమ్మాయి పంజాబీ అమ్మాయిట.. ఇద్దరి మధ్య చాలా సంవత్సరాలు ప్రేమాయణం నడిచాక ఓ రోజు సడన్ గా అడివి శేష్ ప్రేమించిన అమ్మాయి పెళ్లి అయిపోయిందట.
మరీ ముఖ్యంగా ఆ అమ్మాయి పెళ్లి తన బర్త్డే రోజు అవ్వడంతో అడివి శేష్ హార్ట్ బ్రేక్ అయిందట.. ఇక ప్రతి సంవత్సరం తన బర్త్డే రోజు అదే గుర్తుకు వస్తుందట. చాలామంది బర్త్డే రోజు ఎంజాయ్ చేస్తూ గడుపుతారు. కానీ నాకు మాత్రం నా లైఫ్ లో ఈరోజు ఒక స్యాడ్ స్టోరీ ఉంది కదా అని గుర్తు చేసుకుంటారట. అలా ఆ సమయంలో అడివి శేష్ ప్రేమలో దెబ్బతిన్నానని చెప్పారు. అలాగే ప్రస్తుతం అడివి శేష్ తన పెళ్లి పర్సనల్ లైఫ్ కంటే ఎక్కువగా సినిమాల మీదే దృష్టి పెట్టానని, ప్రస్తుతం ఉదయం లేవడంతోనే ఈ సినిమా ఎలా ఎప్పుడు పూర్తి చేయాలి అనే ఆలోచనలతోనే ఉంటారట.