ఉస్తాద్రామ్.. టాలీవుడ్ డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఇంకా చెప్పాలంటే ఇటు వరుస ఫ్లాప్‌లతో ఉన్న రామ్‌కు.. అటు వరుస ఫ్లాపులతో ఉన్న పూరి జగన్నాథ్ కెరీర్‌కు ఇస్మార్ట్ శంకర్ సినిమా మంచి ఊపిరి ఊదింది. ఆ సినిమా సూపర్ హిట్ అయ్యాక.. మళ్ళీ రామ్, పూరి జగన్నాథ్‌కు ఇబ్బందులు తప్పలేదు. పూరీ అయితే విజయ్ దేవరకొండతో ఏకంగా లైగర్ లాంటి డిజాస్టర్ సినిమా తీసి చేతులు కాల్చుకున్నారు.
ఇప్పుడు వీరిద్దరి కెరీర్‌కు ఇస్మార్ట్ శంకర్ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న డబుల్ ఇస్మార్ట్ సినిమా కీలకం కానుంది. అయితే డబుల్ ఇస్మార్ట్ సినిమాకు అదిరిపోయే ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా మీద ముచ్చట పడ్డారు నిర్మాత నిరంజన్ రెడ్డి దంపతులు. నార్త్ ఇండియా మినహా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా థియేటర్ రైట్స్‌ను రూ.54 కోట్లకు సొంతం చేసుకున్నారు. నాన్ థియేట్రికల్ మార్కెటింగ్ జరిగిపోయింది. థియేటర్ మార్కెట్ కూడా ఈ ఏకంగా రూ.54 కోట్లకు అమ్ముడు అయింది. ఇక నార్త్ ఇండియా రిలీజ్ ఒక్కటే మిగిలింది.
పబ్లిసిటీకి ఇప్పటికే రెండు పాటలు వదిలారు. ఇవన్నీ బాగున్నాయి. సినిమాపై క్లాస్ వర్గాలతో పాటు.. మాస్ వర్గాలలోను మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పుడున్న పరిస్థితులలో తెలుగు సినీ ప్రేక్షకులు థియేటర్లలోకి ఏదైనా మంచి సినిమా వస్తుందా ? అని కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఇది ఇస్మార్ట్ శంకర్ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న డబుల్ ఇస్మార్ట్ కు మంచి ప్లస్ పాయింట్ కానుంది. పైగా ఆగస్టు 15 అంటే మంచి డేట్.. నాలుగురోజులు వరుసగా సెలవులు ఉన్నాయి. ఇలాంటి టైమ్‌ను థియేటర్లు అస్సలు వదులుకోవు. డబ్బులు ఇస్మార్ట్ సోలోగా థియేటర్లలోకి వస్తోంది. సినిమాకు కాస్త మంచి టాక్ వస్తే చాలు.. రామ్, పూరి ఇద్దరు కలిపి డబుల్ ఇస్మార్ట్ అంటూ థియేటర్లలో కుమ్మేసుకోవచ్చు.