Moviesఫ్రెండ్స్ ముందు ఆ మాట అన్నందుకు బాల‌య్య‌ను కొట్టిన అన్న హ‌రికృష్ణ‌..!

ఫ్రెండ్స్ ముందు ఆ మాట అన్నందుకు బాల‌య్య‌ను కొట్టిన అన్న హ‌రికృష్ణ‌..!

తెలుగు సినిమా చ‌రిత్ర‌లో నంద‌మూరి ఫ్యామిలీకి ఉన్న క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. దివంగ‌త న‌ట సౌర్వ‌భౌమ ఎన్టీఆర్ న‌ట వార‌స‌త్వాన్ని అందిపుచ్చుకుని ఆయ‌న త‌న‌యులు బాల‌కృష్ణ‌, హ‌రికృష్ణ ఇద్ద‌రూ సినిమా రంగంలోకి వ‌చ్చారు. కెరీర్ స్టార్టింగ్‌లో హ‌రికృష్ణ కొన్ని సినిమాలు చేశాక సినిమా రంగానికి దూర‌మై రాజ‌కీయాల్లోకి వెళ్లారు. ఆ త‌ర్వాత ఆయ‌న తిరిగి వ‌చ్చి తిరిగి సినిమాలు చేశారు. ఇక బాల‌య్య సినిమాల్లోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి గ్యాప్ లేకుండా కంటిన్యూగా సినిమాలు చేసుకుంటూ పోతున్నారు.

నంద‌మూరి వంశంలో హ‌రికృష్ణ‌, బాల‌య్య మ‌ధ్య సోద‌ర బంధం మిగిలిన వారితో పోలిస్తే చాలా స్పెష‌ల్‌. బాల‌య్యకు అన్న అంటే ఎంతో ఇష్టం.. అన్న మాట ఎప్పుడూ జ‌వ‌దాట‌డు. ప్ర‌స్తుతం బాల‌య్య కెరీర్ ప‌రంగా ఫుల్ స్వింగ్‌లో ఉన్నాడు. బాల‌య్య ప‌ట్టింద‌ల్లా బంగారం అవుతోంది. ఆయ‌న హ్యాట్రిక్ హిట్ల‌తో దూసుకుపోతూ త్వ‌ర‌లోనే త‌న 109వ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాడు. ఇక బాల‌య్య … త‌న అన్న హ‌రికృష్ణ‌తో ఓ చిన్న‌నాటి జ్ఞ‌పకాన్ని గ‌తంలో నెమ‌ర‌వేసుకున్నారు. త‌న అన్న హ‌రికృష్ణ చేతిలో తాను ఎలా దెబ్బ‌లు తిన్నానో బాల‌య్య చెప్పారు.

ఓ సారి బాల‌య్య త‌న ఫ్రెండ్స్‌ను తీసుకుని త‌మ పొలాల్లోకి వెళ్లాడ‌ట‌. అదే టైంలో హ‌రికృష్ణ పొలంలో ప‌ని చేస్తున్నాడ‌ట‌. వెంట‌నే బాల‌య్య ఆ పొలాల‌ను చూపిస్తూ ఇవ‌న్నీ మావే అని చెప్పాడ‌ట ఫ్రెండ్స్‌కు. వెంట‌నే కోపం వ‌చ్చిన హ‌రికృష్ణ ఓ క‌ట్టె ప‌ట్టుకుని బాల‌య్య చొక్కా ప‌ట్టుకుని ఇంటిదాకా తీసుకువెళ్లాడ‌ట‌. క‌ష్ట‌ప‌డి ప‌ని చేయ‌డం రాదు కాని.. నా పొలం అంటావా.. నారు పోశావా.. కోత కోశావా.. కుప్ప నూర్చావా ఇది నీ పొలం అని ఎలా చెపుతున్నావ్ అని కోప్ప‌డ్డాడ‌ట‌. అక్క‌డే ఉన్న హ‌రికృష్ణ‌, బాల‌య్య తాత కూడా హ‌రికృష్ణ‌కే వ‌త్తాసు ప‌లికాడ‌ట‌. అలా హ‌రికృష్ణ ముందు నుంచి క‌ష్టం తెలిసిన మొర‌టు మ‌నిషి అని బాల‌య్య చెప్పాడు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news