Moviesఅవికా గోర్ న్యూ** ఫొటోస్ పంపించమన్న పాన్ ఇండియా హీరో..!

అవికా గోర్ న్యూ** ఫొటోస్ పంపించమన్న పాన్ ఇండియా హీరో..!

స్టార్ మాలో ప్రసారమయ్యే చిన్నారి పెళ్లికూతురు సీరియల్ అప్పట్లో ఎంత ప్రభంజనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సీరియల్ ని చాలామంది ఇష్టంగా చూసేవారు. అయితే ఈ సీరియల్‌లో చిన్నారి పెళ్లికూతురుగా చేసిన అవికా గోర్ టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలా ఈమెను హీరోయిన్ గా పెట్టి నాగార్జున ఉయ్యాల జంపాల అనే సినిమా కూడా తీశారు. ఈ సినిమాకి నాగార్జున, రామ్మోహన్ నిర్మాతలుగా చేయగా విరంచి వర్మ దర్శకత్వం వహించారు.

ఇక ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడంతో అవికా గోర్ కి టాలీవుడ్ లో మంచి గుర్తింపు లభించింది.
ఆ తర్వాత సినిమా చూపిస్త మావా,లక్ష్మీ రావే మా ఇంటికి, ఎక్కడికి పోతావు చిన్నవాడా, టెన్త్ క్లాస్ డైరీస్, ఉమాపతి, థాంక్యూ, పాప్ కార్న్ వంటి ఎన్నో సినిమాల్లో నటించింది. అంతే కాకుండా వధువు, మ్యాన్షన్ 24 అనే వెబ్ సిరీస్ లతో పాటు పలు షార్ట్ ఫిలిమ్స్ లో కూడా ఈ ముద్దుగుమ్మ నటించింది. అయితే అలాంటి అవిక గోర్ కేవలం తెలుగులోనే కాకుండా బాలీవుడ్ సినిమాల్లో కూడా నటించింది.

ఇక అప్పట్లో అవికా గోర్ ని ఓ పాన్ ఇండియా హీరో న్యూ** ఫొటోస్ పంపించమని డైరెక్ట్ గా మెసేజ్ పెట్టారట. అయితే సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఓ పేరున్న నటుడు అవికా గోర్ ని అలా అడిగేసరికి అప్పట్లో ఈ వార్త మీడియాలో తెగ వైరల్ అయింది. అయితే ఆ హీరో పేరు బయటకు చెప్పకుండానే ఇంటర్వ్యూలో చేసిన కామెంట్లు మీడియాలో సంచలనం సృష్టించాయి. అయితే కొంతమంది నటీనటులు ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకున్నారట.

ఆ గ్రూపులో అవికా గోర్ ని కూడా యాడ్ చేశాక ఓ పేరున్న హీరో ఆమెకు డైరెక్ట్ మెసేజ్ చేసి న్యూ** ఫోటోలు పంపించమని అడిగేసరికి వెంటనే ఆ గ్రూప్ నుండి అవికా గోర్ రిమూవ్ అవ్వడమే కాకుండా ఆ హీరో నెంబర్ కూడా బ్లాక్ చేసిందట. అంతేకాదు ఓ సందర్భంలో తెలుగు సినిమాలు అంటే నచ్చడం లేదు అంటూ చెప్పడంతో ఈ మాటలు విన్న టాలీవుడ్ ఇండస్ట్రీలోని కొంతమంది దర్శక నిర్మాతలు ఆమెకు అవకాశాలు ఇవ్వడం కూడా మానేసారు. అలా అవికా గోర్ కి తో ఓ తెలుగు హీరో అసభ్యంగా ప్రవర్తించడం అప్పట్లో సంచలనంగా మారింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news