Moviesసొంత కూతురు రేఖ‌నే అలా అడిగిన జెమినీ గ‌ణేష‌న్‌..!

సొంత కూతురు రేఖ‌నే అలా అడిగిన జెమినీ గ‌ణేష‌న్‌..!

బాలీవుడ్ బ్యూటీ రేఖ.. అందానికి మారుపేరు ఈ ముద్దుగుమ్మ..అలాంటి ఈ హీరోయిన్ బాలీవుడ్ లో ఇప్పటికి కూడా స్టారే.. భర్త చనిపోయిన కూడా నిండు ముత్తైదువుల నుదిటిన బొట్టు, పాపిట్లో సింధూరం, ఒంటినిండా పద్ధత్తైన చీరకట్టు ఇలా ఎవరైనా సరే ఈమెను చూస్తే ఫిదా అవ్వాల్సిందే.. అయితే ఈమె సౌత్ స్టార్ హీరో అయినటువంటి జెమినీ గణేషన్ ఎఫైర్ పెట్టుకున్న పుష్పవల్లి కూతురు అనే సంగతి ఒకప్పుడు ఎవరికీ తెలియకపోవచ్చు. కానీ ఎప్పుడైతే రేఖ హీరోయిన్ గా బాలీవుడ్ ని ఏలిందో ఆ టైంలో ఈ విషయం బయటపడింది.

అయితే చిన్నప్పటినుండి రేఖ ఎన్నో ఇబ్బందులు పడి ఎలాగైనా స్టార్ అవ్వాలని కష్టపడిందట.ఆమె చిన్నతనంలో పెరిగిన పరిస్థితులే రేఖను స్టార్ హీరోయిన్ ని చేశాయని కొంతమంది అంటారు. మరీ ముఖ్యంగా జెమినీ గణేషన్ పుష్పవల్లిని పెళ్లి చేసుకోకుండానే ఆమెతో ఎఫైర్ పెట్టుకున్నాడు. అలా ఆమెకు పిల్లలు కూడా పుట్టారు. ఇక కొద్ది సంవత్సరాల వరకు రేఖకు తన తండ్రి జెమినీ గణేషన్ అనే విషయం కూడా తెలియదట. కొన్ని సంవత్సరాలు తండ్రి ఎవరో తెలియకుండానే రేఖ పెరిగిందట.

అయితే జెమినీ గణేషన్ కూడా రేఖ స్టార్ హీరోయిన్ అయ్యేవరకు తన కూతురు అని ఎక్కడా చెప్పుకోలేదని కొంత మంది బాలీవుడ్ జనాలు అంటుంటారు.అయితే ఈ విషయం పక్కన పెడితే.. ఈ లోకంలో ఒక కూతురిని ఏ తండ్రి అనకూడని మాట జెమినీ గణేషన్ రేఖ ని అన్నారట.అదేంటంటే హీరోయిన్ రేఖ ఇప్పుడే చాలా అందంగా ఉంటుంది అంటే ఆమె టీనేజ్ లో ఇంకా ఎంత అందంగా ఉండేదో ఊహించుకోవచ్చు. అలా ఓసారి జెమినీ గణేషన్ ముంబై కి షూటింగ్ కి వెళ్ళిన సమయంలో అక్కడే రేఖ కనిపించిందట.

అయితే ఆ సమయంలో రేఖ తన కూతురు అనే విషయం తెలియని జెమినీ గణేషన్ అబ్బా ఆ అమ్మాయి ఎంత అందంగా ఉంది అంటూ తన దగ్గరే ఉన్న జర్నలిస్టుని అలాగే తన మేనేజర్ ని ఆమె ఎవరు అని అడిగారట.ఆ తర్వాత ఈ విషయం కాస్త అందరి నోళ్లలోకి వెళ్లి చివరికి రేఖ చెవిన పడడంతో జెమినీ గణేషన్ ని ఎప్పటికీ క్షమించకూడదు. తన తండ్రిగా అంగీకరించకూడదు అని అనుకుందట.

కానీ జెమినీ గణేషన్ నాలుగో పెళ్లి చేసుకున్నాక నాలుగో భార్యతో అష్ట కష్టాలు పడి చివరికి కూతురు రేఖ చెంతనే చేరాడు. ఆ సమయంలో రేఖ అలాగే వదిలేయకుండా తండ్రిని దగ్గరికి తీసుకొని అక్కున చూసుకుంది. అలా జెమినీ గణేషన్ రేఖను తన కూతురుగా ఒకానొక సమయంలో ఒప్పుకోకపోయినప్పటికీ రేఖ మాత్రం తండ్రి చివరి రోజుల్లో ఎంతో బాగా చూసుకుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news