Moviesఆ స్టార్ హీరోయిన్‌పై మోజుప‌డ్డ నాగార్జున‌... ఆమె చెప్పిన రేటు చూసి...

ఆ స్టార్ హీరోయిన్‌పై మోజుప‌డ్డ నాగార్జున‌… ఆమె చెప్పిన రేటు చూసి దండం పెట్టేశాడా..?

టాలీవుడ్ కింగ్ నాగార్జున అంటేనే అమ్మాయిల క‌ల‌ల రాకుమారుడు. నాగ్ ఆ రోజుల్లోనే ఎంతో మంది బాలీవుడ్ స్టార్ హీరోయిన్ల‌తో న‌టించారు. బాలీవుడ్ హీరోయిన్లు సైతం నాగార్జున‌తో సినిమా చేసేందుకు ఆస‌క్తి చూపేవారు. అయితే అప్ప‌ట్లో బాలీవుడ్‌నే కాదు.. దేశ‌వ్యాప్తంగా త‌న అంద‌చందాల‌తో పాటు న‌ట‌న‌తో ఓ ఊపు ఊపేసిన ఓ స్టార్ హీరోయిన్‌తో న‌టించాల‌ని నాగ్ మోజుప‌డ్డాడ‌ట‌… త‌న సినిమాలో న‌టించాల‌ని ఆమెను ఒప్పించాడ‌ట‌.. అయితే ఆమె చెప్పిన రేటు విని నాగ్ గుండెలు అదిరిపోవ‌డంతో ఆమెకు దండం పెట్టి వ‌చ్చేశాడు.

అస‌లు విష‌యంలోకి వెళితే బాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా వెలిగిన‌ మాధురీ దీక్షిత్ మైక్రో బయాలజిస్ట్ అవ్వాలనుకున్నా సినీ రంగంమీద ఆస‌క్తితో ముందు క్లాసికల్ డాన్స్ నేర్చుకుంది. కథక్ నృత్యం 8 ఏళ్లుగా నేర్చుకోవ‌డంతో అది ఆమె సినీ కెరీర్‌ను ఎక్క‌డికో తీసుకువెళ్లింది. 1984లో మాధురి దీక్షిత్ హీరోయిన్‌గా అబోద్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. తేజాబ్ సినిమాతో బాలీవుడ్‌లో పాపుల‌ర్ అయ్యింది.

అక్క‌డ నుంచి ఆమె వ‌రుస హిట్ల‌తో వెన‌క్కు తిరిగి చూసుకోలేదు. ఆ టైంలో మాధురి బాలీవుడ్ ఇండ‌స్ట్రీలోనే హ‌య్య‌స్ట్ రెమ్యున‌రేష‌న్ తీసుకునే హీరోయిన్‌గా రికార్డుల్లోకి ఎక్కింది. అప్ప‌ట్లో ఫిల్మ్‌ఫేర్ అవార్డులు వ‌రుస‌గా గెలుచుకుని దేశ‌వ్యాప్తంగా ఒక ఊపు ఊపేసింది. ఆ టైంలో నాగార్జున మాధురి దీక్షిత్‌ను తెలుగులోకి తీసుకు రావ‌డానికి చాలా ట్రై చేశాడ‌ట‌.

అన్న‌పూర్ణ బ్యాన‌ర్లో వ‌చ్చిన ఓ సినిమాకు ఆమెను హీరోయిన్‌గా అడిగితే అప్ప‌ట్లో 15 రోజుల కాల్షీట్ల‌కు కోటి అడిగింద‌ట‌. వెంట‌నే షాక్ అయిన నాగార్జున మాధురిని వ‌ద్ద‌నుకుని మ‌రో హీరోయిన్తో ఎడ్జెస్ట్ అయిపోయాడు. ఆ త‌ర్వాత ఎంతోమంది హీరోయిన్లు తెలుగులో స్టార్ హీరోల స‌ర‌స‌న న‌టించినా.. బాలీవుడ్ నుంచి మాధురి మాత్రం తెలుగులోకి న‌టించ‌లేదు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news