సినిమా ఇండస్ట్రీలోకి ఎంతో మంది హీరోయిన్లు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు.కానీ కొద్ది మంది హీరోయిన్లు మాత్రమే తమ నటనతో ప్రేక్షకులను మెప్పించగలరు. అలాంటి వారిలో కన్నడ బ్యూటీ అనుష్క శెట్టి కూడా ఒకరు. అయితే అనుష్క శెట్టి సినిమాల్లోకి రాకముందు సెలబ్రిటీలకు యోగ నేర్పిస్తూ యోగ టీచర్ గా కొనసాగింది. ఆ తర్వాత ఓ సీరియల్ లో కూడా చేసింది.కానీ అనుష్కకి సినిమాల్లో హీరోయిన్ అవ్వాలనే కోరిక ఉండేదట.అయితే ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా నువ్వు హీరోయిన్ మెటీరియల్ వి కాదు. నీకు సినిమాల్లో ఎవరు చాన్స్ ఇవ్వరు అని చెప్పేవారట.
దాంతో విసిగిపోయిన అనుష్క శెట్టి సినిమా హీరోయిన్ ఆశ పక్కన పెట్టి యోగ టీచర్ గా మారిపోయింది. అయితే అనుష్క శెట్టి అలా యోగ చేసే సమయంలో నువ్వు హీరోయిన్ లా చాలా అందంగా ఉన్నావ్. సినిమాల్లో ట్రై చేయొచ్చు కదా అని చాలామంది అక్కడికి వచ్చిన వాళ్ళు పొగిడారట.వారి మాటలు విని అనుష్క మళ్ళీ సినిమా ప్రయత్నాలు మొదలుపెట్టి ఎన్నో ఆఫీసుల చుట్టూ తిరిగిందట. అలా ఓ సీరియల్ లో అవకాశం వచ్చాక సినిమాలో హీరోయిన్ అవ్వాలి అని కన్నడలోని టాప్ డైరెక్టర్ ని ఆశ్రయించి సార్ మీ సినిమాలో నాకు ఒక చిన్న పాత్ర అయినా ఇవ్వండి అని అడిగిందట.
దాంతో అనుష్కని చూసిన ఆ డైరెక్టర్ అసలు నువ్వు హీరోయిన్ మెటీరియల్ వే కాదు.. నువ్వు బట్టలు మొత్తం విప్పి చూపించినా కూడా నిన్ను హీరోయిన్ గా సినిమాల్లో అస్సలు తీసుకోరు అంటూ ఘోరంగా ఇన్సల్ట్ చేశారట. అంతేకాదు నువ్వు సినిమాలో హీరోయిన్ గా చేయడం కంటే పెళ్లి చేసుకొని చక్కగా పిల్లల్ని కని భర్త పిల్లలతో హాయిగా ఉండు అంటూ సలహా కూడా ఇచ్చారట. కానీ అనుష్క మాత్రం డైరెక్టర్ మాటలకు ఏమాత్రం నిరాశ పడకుండా పట్టువదలని విక్రమార్కుడిలా సినిమాలో ఆఫర్స్ కోసం ట్రై చేసింది.
అలా ఏ డైరెక్టర్ అయితే అనుష్క ని హీరోయిన్ గా పనికిరావు అని అన్నారో ఆమె పెద్ద హీరోయిన్ అయ్యాక ఆ డైరెక్టరే ఆమె దగ్గరికి వచ్చి సినిమా చేయమని అడిగారట. కానీ అనుష్క మాత్రం ఆ రోజు ఆయన అన్న మాట గుర్తుచేసుకొని నేను నటించను అని చెప్పిందట. అలా ఏ పరిస్థితిలోనైనా సరే ఎవరిని తక్కువగా అంచనా వేయకూడదు అని అనుష్కని చూసి ఆ డైరెక్టర్ బుద్ధి తెచ్చుకున్నారట.