విక్టరీ వెంకటేష్ కెరీర్ లో సూపర్ హిట్ గా నిలిచిన చిత్రాల్లో వసంతం ఒకటి. ఇప్పటికీ ఈ సినిమా టీవీలో వస్తోందంటే ప్రేక్షకులు స్క్రీన్ కు అదొక్కుపోతూ ఉంటారు. అంతలా ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించింది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్ ను విశేషంగా ఆకట్టుకున్న వసంతం సినిమా తాజాగా విడుదలై 21 ఏళ్లు పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా వసంతం గురించి కొన్ని ఆసక్తికర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
వాసు, జెమిని చిత్రాలు వరుసగా ఫ్లాప్ అవ్వడంతో వెంకటేష్ ఈసారి కచ్చితంగా హిట్టు కొట్టాలని నిర్ణయించుకున్నారు. ఆ సమయంలోనే తమిళ దర్శకుడు విక్రమన్ వసంతం కథను వెంకటేష్ కు వినిపించాడు. స్టోరీ నచ్చడంలో వెంకీ సినిమా చేసేందుకు అంగీకరించారు. 2002లో వసంతం ప్రారంభమైంది. హీరోయిన్లుగా ఆర్తి అగర్వాల్, కల్యాణి నటించారు. ఇతర ముఖ్యమైన పాత్రల్లో ఆకాష్, సునీల్, చంద్ర మోహన్, తనికెళ్ల భరణి తదితరులు నటించారు. ఎస్.ఎ రాజ్‌కుమార్ మ్యాజిక్ డైరెక్టర్ గా పని చేశాడు.
2003 జులై 11న విడుదలైన వసంతం చిత్రం పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంది. వెంకటేష్ యాక్టింగ్, కథ-కథనం, సాంగ్స్ సినిమాకు ప్రధానం బలంగా నిలిచాయి. ముఖ్యంగా సిరివెన్నెల సీతారామ శాస్త్రి రచించిన గాలి చిరుగాలి సాంగ్ అప్పట్లో ఒక సెన్సేషన్ అయింది. అలాగే టాక్ అనుకూలంగా ఉండటం వల్ల వసంతం మూవీ క్లీన్ హిట్ గా నిలిచింది.
వసంతం మూవీ రిలీజ్ కు సరిగ్గా రెండు రోజులు ముందు రాజమౌళి, ఎన్టీఆర్ కాంబినేషన్ తెరకెక్కిన సింహాద్రి చిత్రం విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది. బాక్సాఫీస్ వద్ద వీరవిహారం చేస్తోంది. ఆ టైమ్ లో సింహాద్రి ప్రభంజనాన్ని తట్టుకుని వెంకటేష్ వసంతం చిత్రం మంచి వసూళ్లను సాధించింది. రూ.8.7 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా.. ఫుల్ రన్ లో రూ.13.36 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది. మొత్తంగా రూ.4 కోట్ల లాభాలను సొంతం చేసుకుంది.