Moviesప‌వ‌న్ క‌ళ్యాణ్‌ ఫస్ట్ ఎఫై** అదే.. ఉదయాన్నే ఫస్ట్ కిస్.. పక్కలోనే...

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ ఫస్ట్ ఎఫై** అదే.. ఉదయాన్నే ఫస్ట్ కిస్.. పక్కలోనే ఉండేద‌ట‌..!

చాలామంది సెలబ్రిటీలకు సంబంధించి వారి ఫస్ట్ లవ్ అనేది సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతూ ఉంటుంది. మరీ ముఖ్యంగా సెలబ్రిటీలు ఏదైనా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూలలో పాల్గొన్న సమయంలో కచ్చితంగా వారికి సంబంధించిన ఫస్ట్ లవ్ ఏంటి అనేది బయట పెట్టించాలని చూస్తూ ఉంటారు యాంకర్లు. ఇప్పటికే మన ఇండస్ట్రీలో ఉన్న టాప్ సెలబ్రిటీలందరికీ ఫస్ట్ లవ్ అనేది ఉంది. మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న ఫస్ట్ లవ్ ఎవరు.. ఆయన మొదట ప్రేమించింది ఎవరిని అనేది ఇప్పుడు చూద్దాం.. చాలామంది పవన్ కళ్యాణ్ ఫస్ట్ లవ్ అంటే ఆయన పెళ్లి చేసుకున్న నందిని అనే అమ్మాయి అనుకుంటారు.

కానీ మీరు కూడా అలా అనుకుంటే తప్పులో కాలేసినట్టే.. ఎందుకంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న ఫస్ట్ లవ్ రివాల్వర్.. అవును మీరు వినేది నిజమే. ఇదేదో తమాషాకి చెబుతున్నది కాదు..పవన్ కళ్యాణ్ ఈ విషయం గురించి మాట్లాడుతూ.. నేను మొదట ఎఫైర్ పెట్టుకుంది రివాల్వర్ తోనే. నాకు రివాల్వర్ అంటే చాలా ఇష్టం. అయితే ఈ విషయం గమనించిన మా అన్నయ్య పొరపాటున నేను ఎక్కడ తీవ్రవాద ఉద్యమాల్లో తిరుగుతానేమోనని భయపడి వెంటనే నాకు రివాల్వర్ కొనిచ్చి ఇంటి దగ్గరే ఉంటాడు అనుకున్నారు. అయితే నా ఉద్దేశం అది కాదు. అన్యాయం జరిగే వాళ్లకి దీనితో సమాధానం చెప్పాలనే ఉద్దేశం ఉంది. కానీ తుపాకీ సొంతం చేసుకోవాలని కాదు.. ఆరోజు అన్నయ్యతో చెప్పలేక పోయాను.

ఇక మా అన్నయ్య కొనిచ్చిన రివాల్వర్ ని నేను ఒక్కసారి కూడా విడిచిపెట్టి ఉండలేక పోయాను. ప్రతిరోజు నేను నా జేబులో దాన్ని పెట్టుకొని తిరిగాను. అంతే కాదు ఉదయం లేవడంతోనే ఫస్ట్ కిస్ దానికే ఇచ్చేవాడిని. ఇక ఆశ్చర్యం ఏమిటంటే..నేను పడుకునే సమయంలో కూడా నా పక్కలోనే రివాల్వర్ ని పెట్టుకొని ఉండేవాడిని.అలా నా ఫస్ట్ లవ్ మా అన్నయ్య కొనిచ్చిన రివాల్వర్. అయితే ఇంట్లో నా పేరెంట్స్,నా ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం. కానీ వాటన్నింటికంటే అన్నయ్య కొనిచ్చిన రివాల్వర్ మీద పిచ్చి ప్రేమ పెంచుకున్నాను. ఒక రకంగా చెప్పాలంటే నా ఫస్ట్ ఎఫైర్ అన్నయ్య కొనిచ్చిన రివాల్వర్ తోనే అంటూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గతంలో విశాఖ పర్యటనలో భాగంగా ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news