సినిమా పరిశ్రమలో కథలు ఒకరి దగ్గర నుంచి మరొకరికి ట్రావెల్ అవుతూనే ఉంటాయి. ఒక హీరో రిజెక్ట్ చేసిన కథతో మరొక హీరో సినిమా చేయడం కొత్తేమి కాదు. అలా కొన్ని సార్లు హిట్ కథలు చేజారితే.. కొన్ని సార్లు అదృష్టం కొద్ది ఫ్లాపుల నుంచి తప్పించుకుంటూ ఉంటారు. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో కూడా అటువంటి సంఘటనలు జరిగాయి. గతంలో మహేష్ బాబు వివిధ కారణాల వల్ల చాలా చిత్రాలను రిజెక్ట్ చేశాడు. అందులో రామ్ పోతినేని ఫ్లాప్ మూవీ కూడా ఉంది.
ఇంతకీ ఆ చిత్రం మారేదో కాదు.. గత ఏడాది విడుదలైన స్కంద. బోయపాటి శ్రీను డైరెక్ట్ చేసిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ లో రామ్ హీరోగా నటిస్తే.. శ్రీలీల, సాయి మంజ్రేకర్ హీరోయిన్లుగా చేశారు. శ్రీకాంత్, శరత్ లోహితస్వా, అజయ్ పుర్కర్, ప్రిన్స్ సిసిల్, దగ్గుబాటి రాజా తదితరులు ఇతర ముఖ్యమైన పాత్రలను పోషించారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్, జీ స్టూడియోస్ బ్యానర్లపై శ్రీనివాస చిట్టూరి, పవన్ కుమార్ సంయుక్తంగా స్కంద మూవీని నిర్మించగా.. ఎస్. థమన్ స్వరాలు అందించాడు.
భారీ అంచనాల నడుమ 2023 సెప్టెంబర్ లో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించడంలో పూర్తిగా విఫలం అయింది. తొలి ఆట నుంచే ఫ్లాప్ టాక్ ను సొంతం చేసుకుంది. దాదాపు రూ. 90 కోట్ల బడ్జెట్ తో స్కంద చిత్రాన్ని నిర్మిస్తే.. బాక్సాఫీస్ వద్ద కనీసం రూ. 60 కోట్లు కూడా రాబట్టలేకపోయింది. అయితే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే.. స్కంద మూవీలో హీరో క్యారెక్టర్ కు ఫస్ట్ ఛాయిస్ రామ్ కాదు. డైరెక్టర్ బోయపాటి శ్రీను మొదట ఈ చిత్రాన్ని సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయాలని భావించాడట.
మహేష్ బాబును కలవడం, ఆయనకు కథ చెప్పడం కూడా జరిగాయట. అయితే మహేష్ స్కంద చిత్రాన్ని రిజెక్ట్ చేశాడు. తన బాడీ లాంగ్వేజ్ కు అంత ఊర మాస్ ఇమేజ్ ఉన్న హీరో క్యారెక్టర్ సెట్ కాదని మహేష్ భావించాడట. ఆ కారణంగానే సున్నితంగా తిరస్కరించాడు. దాంతో బోయపాటి మరో ఆలోచన లేకుండా రామ్ ను హీరోగా సెలక్ట్ చేశారు. కట్ చేస్తే స్కంద బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడింది. మొత్తానికి అలా బిగ్ ఫ్లాప్ నుంచి మహేష్ తప్పించుకుంటే రామ్ మాత్రం అడ్డంగా బుక్కైయ్యాడు.