Moviesఆ టాలీవుడ్ స్టార్ హీరోపై ఆశ‌ప‌డ్డ ప్రియ‌మ‌ణి.. నీకంత సీన్‌లేదు స‌రిపెట్టుకోమ‌న్నారా..?

ఆ టాలీవుడ్ స్టార్ హీరోపై ఆశ‌ప‌డ్డ ప్రియ‌మ‌ణి.. నీకంత సీన్‌లేదు స‌రిపెట్టుకోమ‌న్నారా..?

జాతీయ అవార్డు గ్ర‌హీత ప్రియ‌మ‌ణి.. అలాంటి ప్రియ‌మ‌ణి తెలుగులో రెండున్నర ద‌శాబ్దాల క్రింద‌ట ప్ర‌ముఖ నిర్మాత కేఎస్‌. రామారావు త‌న‌యుడు వ‌ల్ల‌భ హీరోగా ప‌రిచ‌యం అయిన ఎవ‌రే అత‌గాడు సినిమాతో హీరోయిన్గా ప‌రిచ‌యం అయ్యింది. ఆ సినిమా డిజాస్ట‌ర్‌. త‌ర్వాత జ‌గ‌ప‌తిబాబుతో పెళ్లైనకొత్త‌లో సిన‌మా ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది. దీంతో అటు త‌మిళంలోనూ.. ఇటు తెలుగులోనూ ఆమె మంచి అవ‌కాశాలు ద‌క్కించుకుంది.

ఇంత‌కు ప్రియ‌మ‌ణి ఎవ‌రో కాదు… బాలీవుడ్ స్టార్ హీరోయిన్ విద్యాబాలన్ ప్రియమణికి బంధువు. అయితే ప్రియ‌మ‌ణి ఎప్పుడూ ఈ బంధుత్వాన్ని అడ్డం పెట్టుకుని అవ‌కాశాలు అందుకోవాల‌ని ట్రై చేయ‌లేదు. లేదంటే ప్రియ‌మ‌ణి ఎప్పుడో ప‌దేళ్ల క్రిత‌మే బాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి ఉండేది. ఇక కొన్నేళ్ల క్రితం ఆమె ముస్తఫా రాజ్ ని పెళ్లి చేసుకుంది. అనంత‌రం ప్రియమణి ఇండస్ట్రీకి దూరం అవుతుందనుకున్నారు.

పెళ్ల‌య్యాక కూడా ఆమె బాలీవుడ్‌, టాలీవుడ్ వెబ్‌సీరిస్‌ల‌తో పాటు తెలుగులో వెంక‌టేష్ లాంటి సీనియ‌ర్ల ప‌క్క‌న హీరోయిన్‌గా అవ‌కాశాలు అందుకుంది. ప్రియ‌మ‌ణి ఫ‌స్ట్ ఇన్నింగ్స్‌లోనే టాలీవుడ్ ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ స‌ర‌స‌న హీరోయిన్‌గా నటించాలనుకుంది. నితిన్ సరసన బికినీ వేసినా… గోపీచంద్ సరసన బీచ్ సాంగ్ లో అందాలు ఆరబోసినా ఆమెకు బ‌న్నీ స‌ర‌స‌న మాత్రం ఛాన్స్ రాలేదు. చివ‌ర‌కు ఎన్టీఆర్‌తోనూ య‌మ‌దొంగ చేసింది.బ‌న్నీతో ఎలాగైనా హీరోయిన్‌గా తెర‌మీద క‌నిపించాల‌ని ఆమె ఎంతో ఆశ‌ప‌డింద‌ట‌. అయితే ఆ ల‌క్కీ ఛాన్స్ మాత్రం ఆమెకు ద‌క్క‌లేదు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news