Newsఆర్తి అగ‌ర్వాల్ కాకుండా త‌రుణ్ ల‌వ్ చేసిన మ‌రొక స్టార్ హీరోయిన్...

ఆర్తి అగ‌ర్వాల్ కాకుండా త‌రుణ్ ల‌వ్ చేసిన మ‌రొక స్టార్ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేసి ఆ తర్వాత హీరోగా ఎదిగిన నటుల్లో తరుణ్ ఒకడు. ప్రముఖ నటి రోజా రమణి కుమారుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన తరుణ్.. 1990 నుంచి 1995 వరకు బాల నటుడుగా సినిమాలు చేశాడు. 2000 సంవత్సరంలో నువ్వే కావాలి మూవీతో హీరోగా మారాడు. నువ్వే కావాలి చిత్రం సూపర్ డూపర్ హిట్ కావడంతో తరుణ్ కు అవకాశాలు వెల్లువెత్తాయి.

పలు విజయవంతమైన చిత్రాలతో అనతి కాలంలోనే టాలీవుడ్ లో తరుణ్ స్టార్ ఇమేజ్ ను సంపాదించుకున్నాడు. లవర్ బాయ్ గా ఓ వెలుగు వెలిగాడు. అయితే ఎంత తొందరగా తరుణ్ స్టార్ అయ్యాడో అంతే తొందరగా ఫేడౌట్ హీరోల లిస్టులో చేరాడు. 2005 నుంచి 2014 వరకు దాదాపు ప‌ది సినిమాలు చేసినప్పటికీ తరుణ్ కు సరైన హిట్‌ మాత్రం పడలేదు. దాంతో దర్శక నిర్మాతలు అతన్ని పక్కన పెట్టేశారు.

సినిమాల గురించి పక్కన పెడితే.. దివంగత నటి ఆర్తి అగర్వాల్ తో తరుణ్ ప్రేమాయణం అప్పట్లో ఒక సెన్సేషన్ ను క్రియేట్ చేసింది. నువ్వు లేక నేను లేను సమయంలోనే ఇద్దరూ ప్రేమలో పడ్డారు. తరుణ్, ఆర్తి అగర్వాల్ పెళ్లి చేసుకుంటారని కూడా వార్తలు వచ్చాయి. కానీ పెళ్ళి వరకు వెళ్లకుండానే వీరి ప్రేమ విఫలం అయింది. 2007లో పెద్దలు చూసిన అబ్బాయిని పెళ్లి చేసుకున్న ఆర్తి.. 2009లో విడాకులు తీసుకుంది. 2015లో లైపో సెక్షన్ కారణంగా తలెత్తిన సైడ్ ఎఫెక్ట్స్ వ‌ల్ల మ‌ర‌ణించింది.

ఇక‌పోతే ఆర్తి అగర్వాల్ కాకుండా తరుణ్ ఇండస్ట్రీకి చెందిన మరొక స్టార్ హీరోయిన్ ను ప్రేమించాడనే టాక్ ఉంది. ఇంతకీ ఆ హీరోయిన్ మరెవరో కాదు శ్రియా. 2002లో వ‌చ్చిన సూప‌ర్ హిట్ ఫిల్మ్ నువ్వే నువ్వేలో త‌రుణ్‌, శ్రియా జంట‌గా న‌టించారు. ఆ వెంట‌నే ఎలా చెప్పాను, నీ మనసు నాకు తెలుసు వంటి సినిమాలు చేశారు. ఈ క్ర‌మంలోనే ఇద్ద‌రి మ‌ధ్య ప్రేమ చిగురించింద‌ట‌. కానీ అప్ప‌టికే మ‌రోవైపు త‌రుణ్‌-ఆర్తి ప్రేమాయ‌ణం వార్త‌లు ఫిల్మ్ స‌ర్కిల్స్ లో జోరుగా చ‌క్క‌ర్లు కొడుతున్నారు. వీటి గురించి తెలుసుకున్న శ్రియా త‌రుణ్ లైఫ్ లో నుంచి సైడ్ అయింద‌ని గ‌తంలో ప్ర‌చారం జ‌రిగింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news