స్టూడెంట్ నెం. 1 తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన రెండో చిత్రం సింహాద్రి. ఈ సినిమా సింహగర్జనకి నిన్నటితో 21 ఏళ్లు. ఈ నేపథ్యంలోనే సింహాద్రి సినిమా గురించి కొన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. వి.ఎం.సి ప్రొడక్షన్స్ బ్యానర్ పై వి.విజయ్ కుమార్ వర్మ, వి.దొరస్వామిరాజు కలిసి సింహాద్రి సినిమాను నిర్మించగా.. కీరవాణి స్వరాలు అందించారు. ఎన్టీఆర్ కు జోడిగా భూమిక, అంకిత నటించారు. నాజర్, భానుచందర్, శరత్ సక్సేనా తదితరులు ఇతర ముఖ్యమైన పాత్రలను పోషించారు.
2003 జూలై 9న విడుదలైన సింహాద్రి చిత్రం తొలి ఆట నుంచే హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఎన్టీఆర్ యాక్టింగ్, రాజమౌళి స్క్రీన్ ప్లే, మాస్ ఎలిమెంట్స్, సాంగ్స్, భూమిక-అకితల గ్లామర్, యాక్షన్ సన్నివేశాలు సినిమాకు హైలెట్ గా నిలిచాయి. ఎన్టీఆర్ అభిమానులతో పాటు సినీ ప్రియులను కూడా సింహాద్రి అద్భుతంగా మెప్పించింది. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది.
రూ. 8.5 కోట్లు బడ్జెట్ తో సింహాద్రి సినిమాను నిర్మించగా.. రూ. 11.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. టాక్ అనుకూలంగా ఉండటంతో ఫుల్ రన్‌లో రూ.25.40 కోట్ల షేర్ ను రాబట్టి బయ్యర్స్ కి రూ.13.9 కోట్ల రేంజ్‌లో లాభాలను అందించింది. 250 కేంద్రాల్లో 50 రోజులు, 150 కేంద్రాల్లో 100 రోజులు, 55 కేంద్రాల్లో 175 రోజులు ఆడి చరిత్ర సృష్టించింది. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఇంద్ర చిత్రం 175 రోజులను 31 డైరెక్ట్ సెంటర్స్ లో జరుపుకోగా.. ఆ రికార్డును సింహాద్రి చిత్తు చిత్తు చేసింది.
అలాగే తెలుగులో విడుదలైన తర్వాత ఈ సినిమాను విజయ్ కాంత్ తమిళంలో రీమేక్ చేశారు. కన్నడలో కూడా రిమేక్ చేయబడింది. కానీ రెండు భాషల్లోనూ పరాజయం పాలైంది. ఇకపోతే సింహాద్రికి ఫస్ట్ ఛాయిస్ ఎన్టీఆర్ కాదు. బాలకృష్ణతో ఈ మూవీని చేయాలని రాజమౌళి భావించారు. అయితే ఆయన ఆలోచన కార్యరూపం దాల్చలేదు. ఆ తర్వాత ప్రభాస్ కు సింహాద్రి కథ వినిపించారు రాజమౌళి. స్టూడెంట్ నెం. 1 మూవీ ప్రభాస్ కు అంతగా నచ్చకపోవడంతో ఆయన సింహాద్రిని రిజెక్ట్ చేయడం జరిగింది. ఫైనల్ గా ఎన్టీఆర్ హీరోగా చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు.