సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న అగ్ర హీరోయిన్లలో అనుష్క శెట్టి ఒకరు. సూపర్ మూవీతో సినిమా పరిశ్రమకు పరిచయమైన అనుష్క.. చాలా తక్కువ సమయంలోనే స్టార్డమ్ సంపాదించుకుంది. అరుంధతి, పంచాక్షరి, భాగమతి వంటి లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో హీరోలతో సమానంగా క్రేజ్ సొంతం చేసుకుంది. 2018 తర్వాత సినిమాలు చేయడంలో జోరు తగ్గించిన అనుష్క.. ప్రస్తుతం మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ కొత్త ప్రాజెక్ట్‌లను లైన్ లో పెడుతూ బిజీ షెడ్యూల్ ను మెయింటైన్ చేస్తుంది.
ఈ సంగతి పక్కన పెడితే.. గతంలో ఓ ఇంటర్వ్యూలో అనుష్క తన కెరీర్ లో బెస్ట్ అండ్ వరస్ట్ మూవీస్ గురించి మాట్లాడింది. తాను నటించిన చిత్రాల్లో వేదం మరియు అరుంధతి చిత్రాలంటే తనకు చాలా ఇష్టమని అనుష్క పేర్కొంది. ఆ సినిమాల్లో నా క్యారెక్టర్స్ ప్రేక్షకులకు ఎంతగానో కనెక్ట్ అయ్యాయని చెప్పుకొచ్చింది. అలాగే తన కెరీర్ మొత్తంలో అత్యంత వరస్ట్ మూవీ ఒక్క మగాడు అని.. ఆ సినిమా తనకు అస్సలు నచ్చదని అనుష్క సెన్సేషనల్ కామెంట్స్ చేసింది.
2008లో ఒక్క మగాడు విడుదలైంది. వై.వి.ఎస్.చౌదరి డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా చేశారు. ఆయనకు జోడిగా అనుష్క శెట్టి, సిమ్రాన్, విషా కొఠారి హీరోయిన్లుగా నటించారు. భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఒక్క మగాడు మూవీ తొలి ఆట నుంచి నెగటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమా కథ శంకర్ తీసిన భారతీయుడు సినిమాకు దాదాపు కాపీ అని చాలా విమర్శులు వచ్చాయి.
అలాగే సర్దార్ పాపారాయుడు సినిమా అంశ కూడా కొంత ఉందని ప్రేక్షకులు పెదవి విరిచారు. హాస్యం గానీ, పాటలు కానీ మరీ దారుణం. బాలకృష్ణ, అనుష్క పెయిర్ కూడా సెట్ అవ్వలేదు. దాంతో ఒక్క మగాడు చిత్రం ఫ్లాప్ టాక్ డిజాస్టర్ గా నిలిచింది. ఇక ఒక్కమగాడు తర్వాత అనుష్క మళ్లీ బాలయ్యతో జతకట్టలేదు. ఇదే వారి మొదటి చిత్రం మరియు ఆఖరి చిత్రం కూడా కావొచ్చు.