టాలీవుడ్ లో గతంలో హీరోయిన్ గా పలు సినిమాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది హీరోయిన్ పూనమ్ కౌర్.. ముఖ్యంగా త్రివిక్రమ్ పైన తనదైన స్టైల్ సెటైర్లు వేస్తూ మరింత పాపులారిటీ సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ.. ఇదిలా వుండగా.. గడిచిన మూడు రోజుల నుంచి హీరో సాయి ధరంతేజ్ సోషల్ మీడియా పైన ఒక మినీ యుద్ధమే చేస్తూ ఉన్నారు.. ముఖ్యంగా యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు పైన యాక్షన్ తీసుకోవాలని తేజ్ పట్టుబడి మరీ తెలంగాణ సీఎం, డిప్యూటీ సీఎం , మహిళా కమిషనర్లను కూడా ట్యాగ్ చేయడం జరిగింది.
దీంతో సాయి ధరంతేజ్ చేసిన ఈ పనికి ప్రతి ఒక్కరు కూడా ప్రశంసిస్తున్నారు. అయితే మరి కొంతమంది నెగటివ్ గా కూడా కామెంట్స్ చేయడం జరుగుతుంది.. వీటి పైన పూనమ్ కౌర్ కూడా అదిరిపోయే కౌంటర్ వేసినట్లుగా తెలుస్తోంది.. రేప్ అనే విషయం మీద హీరో తేజ స్పందించిన విషయంలో జల్సా సినిమాలోని ఒక సన్నివేశాన్ని చూపించి ఒక నెటిజన్.. ఈ విధంగా కామెంట్ చేశారు..”పడుకొని ఉన్న అమ్మాయిని రేప్ చేస్తే ఏమొస్తుంది అంటూ చెప్పే పవన్ కళ్యాణ్ డైలాగ్ ను చూపించి.. ఇలాంటి వారి వల్లే యూత్ మొత్తం చెడిపోతోంది ముందు వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి అంటూ నెటిజన్ సైతం ఒక కౌంటర్ వేశారు..
ఈ విషయం మీద నెటిజన్ వేసిన ట్వీట్ కు సైతం హీరోయిన్ పూనమ్ కౌర్ ఇలా రిప్లై ఇస్తూ.. డైలాగ్స్ రాసింది కేవలం త్రివిక్రమే… అంతకంటే గొప్పగా ఏం రాస్తాడు.. ఆయన నుంచి అంతకంటే ఎక్కువగా ఆశించొద్దు అంటూ అదిరిపోయే పంచు డైలాగ్ తో త్రివిక్రమ్ మీద కౌంటర్ వేసింది ఈ ముద్దుగుమ్మ. ఈ విషయం మీద పలువురు నెటిజన్స్ పలు రకాలుగా అయితే కామెంట్స్ చేస్తున్నారు ..అసలు పూనమ్ కౌర్, త్రివిక్రమ్ మధ్య ఉన్న గొడవ ఏంటి.. ఎందుకు ఎప్పుడూ పూనం ఇంతగా కామెంట్స్ చేసిన త్రివిక్రమ్ ఎప్పుడు స్పందించరనే విధంగా కామెంట్స్ చేస్తున్నారు. పూనం క సమయం దొరికినప్పుడల్లా ఇలా కౌంటర్లు వేస్తూ ఉంటుంది. గతంలో కూడా ఎన్నోసార్లు ఇలాంటి కౌంటర్లు వేయడం మనం చూసే ఉన్నాము..