Moviesన‌మ్ర‌త అనూహ్య నిర్ణ‌యం.. 20 ఏళ్ల త‌ర్వాత మ‌ళ్లీ ఆ ప‌ని...

న‌మ్ర‌త అనూహ్య నిర్ణ‌యం.. 20 ఏళ్ల త‌ర్వాత మ‌ళ్లీ ఆ ప‌ని చేయ‌బోతున్న మ‌హేష్ స‌తీమ‌ణి!?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి, మాజీ మిస్ ఇండియా మరియు ఒకప్పటి స్టార్ హీరోయిన్ నమ్రత శిరోద్కర్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసి ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చిన నమ్రత.. బాలీవుడ్ లో తక్కువ సమయంలోనే స్టార్ హోదాను అందుకుంది. 2000 సంవత్సరంలో వంశీ మూవీతో తెలుగు తెరకు పరిచయమైంది. ఈ సినిమా సమయంలోనే హీరో మహేష్ బాబుతో నమిత ప్రేమలో పడింది.

దాదాపు ఐదేళ్లు రహస్యంగా ప్రేమించుకున్న ఈ జంట 2005లో పెద్దల సమక్షంలో నీరాడంబరంగా వివాహం చేసుకున్నారు. వీరి ప్రేమకు గుర్తుగా సితార గౌతమ్ జన్మించారు. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే నమ్రత మహేష్ తో ఏడడుగులు వేసింది. పెళ్లి తర్వాత ఆమె మళ్ళీ సినిమాల్లో నటించలేదు. అనేక ఆఫర్లు వచ్చినప్పటికీ తిరస్కరించింది. స్టార్ హీరోయిన్ హోదాను వదిలేసి సంపూర్ణ గృహిణిగా మారిన న‌మ్ర‌త‌.. మహేష్ బాబు సినిమాల ఎంపికలో మరియు అతని వ్యాపారాలను చూసుకోవడంలో గ‌త కొన్నేళ్ల నుంచి కీలక పాత్రను పోషిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. తాజాగా నమ్రతకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త తెర‌పైకి వ‌చ్చింది. దాదాపు 20 ఏళ్ల త‌ర్వాత న‌మ్ర‌త మ‌ళ్లీ కెమెరా ముందుకు వ‌చ్చి యాక్ట్ చేయ‌బోతున్నార‌ట‌. సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వాల‌ని న‌మ్ర‌త ఇటీవ‌ల అనూహ్య నిర్ణ‌యం తీసుకున్నార‌ట‌. అందుకు మ‌హేష్ బాబు కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడ‌ట‌. దాంతో న‌మ్ర‌త తాజాగా ఓ మూవీకి సైన్ చేసిందంటూ టాలీవుడ్ ఫిల్మ్ స‌ర్కిల్స్ లో జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది.

ప్రముఖ ఫ్యామిలీకి చెందిన యంగ్ హీరో మూవీతో న‌మ్ర‌త త‌న సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయ‌బోతోంద‌ని.. త్వ‌ర‌లోనే అందుకు సంబంధించిన వివరాలు బ‌య‌ట‌కు రానున్నాయ‌ని అంటున్నారు. అంతేకాదు స‌ద‌రు యంగ్ హీరో మూవీలో న‌మ్ర‌త నెగిటివ్ షేడ్స్ క‌లిగిన ఒక కీల‌క పాత్ర‌ను పోషించ‌బోతోంద‌ని కూడా టాక్ న‌డుస్తోంది. కాగా, గ‌తంలో నమ్ర‌త రీఎంట్రీ గురించి ప‌లు మార్లు వార్త‌లు వ‌చ్చాయి. అయితే న‌మ్ర‌త మాత్రం ఆ వార్త‌ల‌ను కొట్టిపారేసింది. త‌న‌కు మ‌ళ్లీ సినిమాల్లో యాక్ట్ చేయాల‌నే ఆస‌క్తి లేద‌ని స్టేట్‌మెంట్ ఇచ్చింది. మ‌రి ఈసారి ఆమె ఎలా స్పందిస్తారో చూడాలి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news