Moviesఆ హీరోయిన్ పేరు కూతురికి పెట్టుకున్న‌ మంచు మ‌నోజ్‌.. నిరాడంబరంగా బార‌సాల...

ఆ హీరోయిన్ పేరు కూతురికి పెట్టుకున్న‌ మంచు మ‌నోజ్‌.. నిరాడంబరంగా బార‌సాల వేడుక‌!

టాలీవుడ్ హీరో మంచు మనోజ్ ఇటీవల తండ్రి అయిన సంగతి తెలిసిందే. ఆయ‌న సతీమణి భూమా మౌనికా రెడ్డి ఏప్రిల్ లో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే తాజాగా మంచు వారి గారాలపట్టికి కుటుంబ‌స‌భ్యుల న‌డుమ నిరాడంబరంగా బారసాల వేడుకను నిర్వహించారు. ఆపై మంచు మనోజ్ సోషల్ మీడియా ద్వారా తమ కూతురు పేరును ప్రకటించాడు. దేవసేన శోభా ఎంఎం అని మ‌నోజ్‌-మౌనిక దంప‌తులు త‌మ ముద్దుల పాపాయికి నామ‌క‌ర‌ణం చేశారు.

ఈ విష‌యాన్ని తెలుపుతూ మ‌నోజ్ ఒక స్పెష‌ల్ పోస్ట్ పెట్టాడు. మీ అందరి ఆశీస్సులతో మా బిడ్డ దేవసేన శోభ ఎంఎం ను మీకు పరిచయం చేస్తున్నాము. ఇప్పటికే ఎంఎం పులి అనే ముద్దు పేరు ద్వారా త‌ను మీ అందరికీ తెలుసు. ఆ పరమేశ్వరుని భక్తులమైన మేము మా చిన్నారి తల్లికి సాక్షాత్తు ఆ శివుని కుటుంబంలోని సుబ్రహ్మణ్యస్వామి భార్య అయిన దేవసేన పేరును పెట్టుకున్నాము.

మా అత్తగారు స్వర్గీయ శ్రీమతి శోభా నాగిరెడ్డి గారి పేరు నుండి శోభ అనే పేరును కూడా తీసుకోవ‌డం జ‌రిగింది. వారి ఆశీస్సులు ఎల్లప్పుడూ మా కుటుంబంపై ఉంటాయి. అలాగే మా ఇంటి దీపం.. మా కంటి వెలుగు చిన్నారి దేవసేన శోభకు మీ అందరి దీవెనలు కూడా కావాలి అంటూ మంచు మనోజ్ కూతురి పేరును అనౌన్స్ చేశాడు.

అంతేకాకుండా బారసాల వేడుకు సంబంధించిన కొన్ని ఫోటోలను కూడా అందరితో పంచుకున్నాడు. కాగా, దర్శకుడు రాజమౌళి తెర‌కెక్కించిన బాహుబలి చిత్రంలో అనుష్క శెట్టి క్యారెక్టర్ పేరు కూడా దేవసేననే. ఇప్పుడు అదే పేరును మంచు మనోజ్ తన కూతురికి పెట్టుకోవ‌డంతో.. నెటిజ‌న్లు పేరు చాలా బాగుంద‌ని కామెంట్లు చేస్తున్నారు. అన్న‌ట్లు దేవసేన శోభ బార‌సాల వేడుక‌కు మోహ‌న్ బాబు సైతం హాజ‌ర‌య్యారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news