Movies"అందరు గుర్తు పెట్టుకోండి..రాజమౌళిని తలదన్నే మొగుడు వచ్చాడు".. నాగ్ అశ్వీన్ సెన్సేషనల్...

“అందరు గుర్తు పెట్టుకోండి..రాజమౌళిని తలదన్నే మొగుడు వచ్చాడు”.. నాగ్ అశ్వీన్ సెన్సేషనల్ కామెంట్స్ వైరల్..!

ఇప్పుడు ఎక్కడ చూసినా సరే డైరెక్టర్ నాగ్ అశ్వీన్ పేరే ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది . దానికి కారణం కూడా మనకి తెలుసు ..కల్కి సినిమా .. ప్రభాస్ కెరియర్ లోనే భారీ బడ్జెట్ మూవీ. జూన్ 27 ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ టాక్ అందుకోవడమే కాకుండా భారీ వసూలను కూడా క్రియేట్ చేసింది . అంతేనా కల్కి సినిమా చూసిన ప్రతి ఒక్కరు ప్రభాస్ పేరు కన్నా కూడా డైరెక్టర్ నాగ్ అశ్వీన్ నే పొగిడేస్తున్నారు.

డైరెక్షన్ ఈ సినిమాకి హైలైట్ అంటూ ప్రశంసలు కురిపించారు . కాగా ఇప్పుడు నాగ్ అశ్వీన్ కి సంబంధించిన డైరెక్టర్ రాజమౌళితో కంపేర్ చేస్తూ పొగిడేస్తున్నారు. రాజమౌళిని తలదన్నే మొగుడు వచ్చాడు ఇండస్ట్రీకి అంటూ కామెంట్స్ చేస్తున్నారు . సినిమా ఘన విజయం అందుకున్న తర్వాత ఫస్ట్ టైం మీడియా ఇంటరాక్షన్ లో మాట్లాడారు నాగ్ అశ్విన్.. ఈ క్రమంలోనే ఓ రిపోర్టర్ ఇదే కామెంట్స్ ను ఆయనకు వినిపించారు .

ఇప్పుడు జనాలు అందరూ రాజమౌళికి మొగుడు వచ్చాడు అంటూ మాట్లాడుకుంటున్నారు..మీరేమంటారు అనగా అందరూ అనుకుంటున్నారో.. లేదో నాకు తెలియదు మీరు మాత్రమే అన్నారు అంటూ సమాధానం ఇచ్చాడు. అంతేకాదు మరొక రిపోర్టర్ ఈ చిత్రంలో కృష్ణుడి పాత్రలో మహేష్ బాబు నటిస్తే చూడాలి అని చాలామంది కోరుకుంటున్నారు ..మరి అలా ట్రై చేస్తారా..? అంటే..” ఈ సినిమాలో కాదు ఆయనతో ఒక సపరేట్ సినిమా చేయాలని ఉంది” అంటూ చెప్పుకొచ్చాడు .

మహాభారతం లాంటి సినిమాను ఎక్స్పెక్ట్ చేయొచ్చా..? అంటే ఇప్పటికైతే ఆ ఆలోచన లేదు ఫ్యూచర్లో వస్తుందేమో చూద్దాం అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో నాగ్ అశ్వీన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి. మొత్తానికి దర్శకధీరుడు రాజమౌళిని తలదన్నే డైరెక్టర్ అసలు ఇండస్ట్రీలోకి రాడు రాలేడు అని అనుకున్న జనాలకు నేనున్నాను .. నేను వచ్చాను అని ప్రూవ్ చేసాడు ..నాగ్ అశ్వీన్. చూద్దాం వీరిద్దరి మధ్య డైరెక్షన్ టాలెంట్ ఎంతవరకు వెళ్తుందో ..?ఇంకా ఎన్నెన్ని క్రేజీ రికార్డులు నెలకొల్పేలా చేస్తుందో..?

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news