Movies"1000 కోట్లు ఇచ్చినా కూడా అలాంటి పని అస్సలకు చేయను".. నిజమైన...

“1000 కోట్లు ఇచ్చినా కూడా అలాంటి పని అస్సలకు చేయను”.. నిజమైన మగాడిలా మాట్లాడిన రాజమౌళి..!

దర్శక ధీరుడుగా పాపులారిటీ సంపాదించుకున్న రాజమౌళి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే . ఆయన తెరకెక్కించిన సినిమాలు ఎంత బాగా హిట్ అవుతాయి అన్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఒక్కొక్క సినిమా ఒక్కొక్క జోనర్ లో ఉంటుంది . ఆయన సినిమా తెరకెక్కిస్తే అది సూపర్ డూపర్ హిట్ ఆ విషయం అందరికీ తెలిసిందే. కాగా రీసెంట్ గా సోషల్ మీడియాలో రాజమౌళి గతంలో ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి .

Director of RRR SS Rajamouli in West Hollywood, CA. / Bethany Mollenkof for ESPN

రాజమౌళి ఎన్నో సినిమాలు తెరకెక్కించిన ఆయన భయపడి టెన్షన్ పడిన సినిమా మాత్రం మగధీర అంటూ చెప్పుకొచ్చాడు . మగధీర చిత్రంతోనే అన్ని విషయాలు తెలిసాయి అని.. ఒక సెట్ వేస్తే ఎంత ఖర్చవుతుంది ..?ప్రొడక్షన్ టీం కి ఎంత డబ్బులు ఖర్చు అవుతుంది ..? మనం ప్రతి రూపాయి ఎంత జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి అనే విషయం మగధీర సినిమా ద్వారానే తెలిసింది అని చెప్పుకొచ్చాడు . అదృష్టాన్ని అస్సలు నమ్మను అంటూ కూడా చెప్పుకొచ్చాడు .

అంతేకాదు ఒక హీరోయిన్ పది ఫ్లాప్ సినిమాలు అందుకున్న సరే నేను రాసుకున్న క్యారెక్టర్ కి ఆ హీరోయిన్ సూట్ అవుతుంది అంటే కచ్చితంగా ఆమెనే తీసుకుంటాను అని ..1000కోట్లు ఇచ్చిన సరే నేను రాసుకున్న పాత్రకి సూట్ అవ్వని హీరోయిన్ ని.. ఎవరు రికమెండ్ చేసిన తీసుకోను అని రాజమౌళి చెప్పుకొచ్చారు . అంతేకాదు అన్నిటికన్నా రాజమౌళి మగధీర సినిమా కోసం బాగా కష్టపడ్డారట . ప్రతి సీన్ చేసేటప్పుడు ఎంజాయ్ చేస్తూనే చాలా చాలా నేర్చుకున్నారట . జానపద చిత్రాలు పౌరాణిక చిత్రాలు కూడా చేయొచ్చు అనే నమ్మకం కుదిరింది యమదొంగ సినిమాతోనేనని రాజమౌళి చెప్పుకొచ్చారు . ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు నెట్టింట బాగా ట్రెండ్ అవుతున్నాయి..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news