Moviesరామ్ చరణ్ అభిమానులకి మండించే కామెంట్స్ చేసిన ప్రభాస్ పెద్దమ్మ..అంత మాట...

రామ్ చరణ్ అభిమానులకి మండించే కామెంట్స్ చేసిన ప్రభాస్ పెద్దమ్మ..అంత మాట అనేసింది ఏంటి..?

తెలిసి చేసిందో ..తెలియక చేసిందో తెలియదు కానీ ..ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు మెగా ఫాన్స్ కు మండించేలా ఉన్నాయి . ఎస్ ప్రెసెంట్ ఆమె మాట్లాడిన మాటలు నెట్టింట బాగా వైరల్ గా మారాయి . హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద క్షత్రియ సేవా సమితి వారు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 127 వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు . శ్యామలాదేవి కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు

ఇదే క్రమంలో ఆమె మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు పాత్రలో కృష్ణం రాజు గారు నటించాలి అని అనుకున్నారు.. కానీ కుదరలేదు ఆ తర్వాత కృష్ణ గారు ఆ చిత్రంలో నటించిన మెప్పించారు. అది ఒక అద్భుతమైన చిత్రం.. ఆ సినిమా వచ్చి ఎన్నో ఏళ్లు గడిచిపోయింది.. మరొకసారి అల్లూరి సీతారామరాజుని అందరూ వెండితెరపై చూడాలి అనుకుంటున్నారు . ప్రభాస్ ఫ్యాన్స్ అల్లూరి సీతారామరాజుగా రెబల్ స్టార్ ని చూడాలి అనుకుంటున్నారు.

అదే విషయం నాకు చెప్పారు.. నేను ప్రభాస్ కి చెప్తాను ఏ మాత్రం ఛాన్స్ ఉన్న ప్రభాస్ అల్లూరి సీతారామరాజుగా కనిపిస్తాడు.. ప్రభాస్ సీతారామరాజు పాత్రలో నటిస్తే ఆయన మళ్లీ పుట్టినట్టే ఉంటుంది అంటూ చెప్పుకొచ్చారు. అయితే దీని పట్ల రామ్ చరణ్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు . రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమాలో అల్లూరి సీతారామరాజు గారి పాత్రలో కనిపించాడు. ఆ పాత్రలో చరణ్ తప్ప ఇంకొకరిని ఊహించుకోలేం అంటూ మెగా ఫాన్స్ చెప్తుంటే రెబెల్ స్టార్ ఆ పాత్రలో నటిస్తే ఆయన మళ్లీ జన్మించి వచ్చినట్లే ఉంటుంది అని ప్రభాస్ పెద్దమ్మ మాట్లాడడం చర్చనీయాంసంగా మారింది . దీంతో సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే న్యూస్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది..!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news