ఇప్పుడు సోషల్ మీడియాలో సినీ ఇండస్ట్రీలో హీరో రాజ్ తరుణ్ అతని మాజీ ప్రేయసి లావణ్య పేర్లు ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతున్నాయో మనకు తెలిసిందే. రాజ్ తరుణ్ అంటే ఓ మల్టీ టాలెంటెడ్ హీరో తన పని తాను చేసుకుని పోతూ ఉంటాడు . చక్కటి భాషతో తనదైన స్టైల్ లో ఆకట్టుకుంటాడు . హిట్లు ప్లాపులతో సంబంధం లేకుండా దూసుకుపోతూ ఉంటాడు. ఇంతవరకే తెలుసు . అయితే ఆయన లో ఓ రసిక రాజా కూడా ఉన్నట్టు రీసెంట్ గానే బయటపడింది .
రాజ్ తరుణ్ నన్ను ప్రేమించి మోసం చేశాడు అంటూ మాజీ ప్రేయసి లావణ్య పలు ఆరోపణలు చేస్తూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన విషయం ఇప్పుడు సినీ వర్గాలను కుదిపేస్తుంది. ఎక్కడ చూసినా ఇదే డిస్కషన్ జరుగుతున్నాయి . అయితే ఇదే క్రమంలో రాజ్ తరుణ్ దానిపై వివరణ ఇచ్చేందుకు మీడియా ముందుకు వచ్చారు . లావణ్యతో నేను రిలేషన్షిప్ లో ఉన్న మాట నిజమే . కానీ ఆమె చెప్పినట్లు మా మధ్య 11 ఏళ్లు సంబంధం లేదు . ఆమెతో వచ్చిన విభేదాలు కారణంగా ఏడేళ్లుగా దూరంగా ఉంటున్నాను.. 2014 నుంచి 2017 వరకు మాత్రమే రిలేషన్ షిప్ లో ఉన్నాను . ఆమెకు డ్రగ్స్ అలవాటు ఉంది అని తెలిసి దూరంగా ఉన్నాను . ఇప్పుడు నేను చేస్తున్న సినిమా రిలీజ్ కి బాగా దగ్గర వచ్చేసింది ..అందుకే ఈమె కావాలని ఇలా నాపై దుష్ప్రచారాలు చేస్తుంది.
నాకు డబ్బు పై ఆశ లేదు నా పేరు చెడగొట్టడానికి ఆమె ఇలా చేస్తుంది. ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్నాను.. నాకు ఉన్న పేరు ఎక్కడ చెడిపోతుందో అని ఒక అమ్మాయి న్యూడ్ ఫోటోలు వాళ్ళ నాన్నకు పంపించి.. బ్లాక్మెయిల్ కూడా చేసింది.. ఇలాంటి పనులు భరించలేకనే దూరంగా ఉంటున్నాను ఆమెకు ..నాకు మందు సిగరెట్ అలవాటు ఉన్నాయి కానీ డ్రగ్స్ అలవాటు లేదు.. ఆమె మస్తాన్ సాయి అనే అబ్బాయి తో రిలేషన్ షిప్ లో ఉన్నింది. నా విల్లాలో నేను కింద ఉంటే వాళ్ళిద్దరూ పైన ఉండేవారు ..మస్తాన్ ఆమె పై దాడి కూడా చేశాడు . ఎఫైఆర్ కాపీ నా దగ్గరే ఉంది . ఆమెతో దూరంగా ఉంటున్నా కూడా నా పేరు చెడగొట్టడానికి ఇలా నన్ను నాపై విమర్శలు చేస్తుంది అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న లావణ్య ఇప్పుడు ఈ విధంగా రాజ్ తరుణ్ పై విమర్శలు చేయడానికి కారణం ఇండస్ట్రీలో ఉండే హీరోయిన్ అంటూ ప్రచారం జరుగుతుంది . సోషల్ మీడియాలో ప్రజెంట్ ఇదే న్యూస్ హాట్ హాట్ గా ట్రెండ్ అవుతుంది..!!