నక్క తోక తొక్కితే అదృష్టం ఎలా అయినా కలిసొస్తుంది అంటూ ఉంటారు మన ఇంట్లోని పెద్దవాళ్లు . బహుశా వేణు స్వామి విషయంలో అదే జరిగినట్లు ఉంది . ఇన్నాళ్లు సోషల్ మీడియాలో వేణు స్వామి ఏ రేంజ్ లో ట్రోలింగ్కి గురయ్యారో అందరికీ తెలిసిందే . మరీ ముఖ్యంగా ప్రభాస్ పెళ్లి గురించి అదేవిధంగా ప్రభాస్ సినిమాల గురించి కాంట్రవర్షియల్ కామెంట్స్ చేసి సోషల్ మీడియాలో ప్రభాస్ ఫ్యాన్స్ చేత బూతులు తిట్టించుకున్న వేణు స్వామి పొలిటికల్ పరంగాను వేలు పెట్టి ఆయన చెప్పిన జాతకాలను తప్పు అని ప్రూవ్ చేసుకునేలా చేశాడు.
తెలంగాణలో బీఆర్ఎస్ అధికారం చేపడుతుంది అని చెప్పాడు అక్కడ సీన్ మారిపోయింది . రేవంత్ రెడ్డి సీఎం గా మారాడు.. ఏపీలోనూ మళ్ళీ కాబోయే సీఎం జగన్ మోహన్ రెడ్డి అంటూ చెప్పాడు . ఇక్కడ సీన్ మారిపోయింది . నారా చంద్రబాబునాయుడు భారీ మెజారిటీతో గెలిచి సీఎంగా అధికారం చేపట్టారు. దీంతో వేణు స్వామి ఇక ప్రిడక్షన్స్ చెప్పను అంటూ స్వయంగా వీడియో రిలీజ్ చేయడం గమనార్హం. అయితే ఆ తర్వాత నుంచి సోషల్ మీడియాకి దూరంగానే ఉంటూ వచ్చాడు వేణు స్వామి . కానీ కొంతమంది ఆకతాయిలు మాత్రం ఆయనను లేనిపోని విషయాలలో ఇన్వాల్వ్ చేస్తూ ట్రోల్ చేశారు . అలాంటి ట్రోలర్స్ కు ఎప్పటికప్పటికీ ఇచ్చి పడేస్తూనే వచ్చాడు వేణు స్వామి.
అయితే ఇప్పుడు కాంట్రవర్షియల్ షోగా పేరు సంపాదించుకున్న బిగ్ బాస్ రియాల్టీ షోలోకి కాంట్రవర్షియల్ జ్యోతిష్యుడు వేణు స్వామి వెళ్ళబోతున్నాడు అంటూ ఓ న్యూస్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. వేణు స్వామి లాంటి వ్యక్తి బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తే ఎలా ఉంటుందో పరిస్థితి అందరికీ తెలిసిందే . పైగా ఈసారి కూడా షోనీ హోస్ట్ చేయబోయేది నాగార్జున ..తన కొడుకు మాజీ కోడలు విడిపోతారని చెప్పింది కూడా వేణు స్వామినే.. అలాంటి వ్యక్తిని ఎలా డీల్ చేస్తాడు ..?అనేది ప్రశ్నార్థకంగా ఉంది .
మరొక పక్క హౌస్ లోకి ఆల్రెడీ ఒక విడిపోయిన జంట వెళ్లబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది. ఆ జంట విషయంలో ఏం చేస్తాడు అంటూ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు . అంతేకాదు తాను చెప్పిన జాతకాలను బాగా నమ్మే జనాలకు వేణు స్వామి బిగ్ బాస్ ద్వారా ఏం ప్రూవ్ చేయాలి అనుకున్నాడు అనేది ఇప్పుడు సంచలనంగా మారింది. అంతేకాదు బిగ్ బాస్ మేనేజ్మెంట్ ఇప్పటి వరకు ఎవరికీ ఇవ్వని అంత హై రెమ్యూనరేషన్ ఇచ్చి మరి ఆయన హౌస్ లోకి పంపిస్తుందట .
అందుతున్న సమాచారం ప్రకారం ..కోటి రూపాయలు రెమ్యూనరేషన్ ఇచ్చి మరి బిగ్ బాస్ మేనేజ్మెంట్ ఆయనను లోపలికి పంపిస్తుందట . కోటి రూపాయల రెమ్యూనరేషన్ అనేది మామూలు విషయం కాదు. ఆ రేంజ్ లోనే కాంట్రవర్షియల్ కంటెంట్ కూడా క్రియేట్ చేయాలి. మరి వేణు స్వామి ఎలా మేనేజ్ చేస్తాడు చూడాలి . కొంతమంది వేణు స్వామి లాంటి వాళ్లు బిగ్ బాస్ కి వెళ్తే మంచిది అంటుంటే మరి కొంతమంది నెగిటివ్ గా కూడా స్పందిస్తున్నారు. అంతేకాదు ఒక హై టాప్ పొలిటీషియన్ రికమండేషన్ తోనే బిగ్ బాస్ లోకి వెళ్లబోతున్నాడు వేణు స్వామి అన్న వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి . అసలు ఇంతలో ఎంత నిజం ఉంది తెలియాలి అంటే అటు బిగ్ బాస్ కానీ ..ఇటు వేణు స్వామీ కానీ స్పందించాల్సిందే ..చూద్దాం మరి ఏం జరుగుతుందో..??