ఇది నిజంగా ప్రభాస్ అభిమానులకి ఊహించని షాక్ అనే చెప్పాలి . టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న రెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా నటించిన సినిమా కల్కి 2898 ఏడి. పాన్ ఇండియా లెవెల్ లో పబ్లిసిటీ సంపాదించుకొని పాపులారిటీ దక్కించుకున్న ప్రభాస్ .. ఎంతో డిఫరెంట్ షేడ్స్ లో కనిపించిన మొట్టమొదటి సినిమా ఇదే కావడం గమనార్హం. కాగా నాగ్ అశ్వీన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా జూన్ 27వ తేదీ రిలీజ్ అయి సంచలన రికార్డులు నెలకొల్పింది.
మొదటి షో తోనే బిగ్ పాజిటివ్ టాక్ అందించుకున్న ఈ సినిమా మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయిలో కలెక్షన్స్ సాధించింది . ఫస్ట్ డేనే ప్రపంచవ్యాప్తంగా 191.5 కోట్లు వచ్చాయి అని.. మూవీ టీం ప్రకటించింది . అంతేకాదు తొలి రోజే అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాల జాబితాలో మూడవ స్థానంలో నిలిచి ప్రభాస్ అభిమానులను ఫుల్ సాటిస్ఫై చేసేసింది ఈ మూవీ . అయితే రెండవ రోజు ఈ సినిమా ఎలాంటి రికార్డ్స్ నెలకొల్పుతుందా..? అంటూ ఈగర్ గా వెయిట్ చేసిన ఫ్యాన్స్ కు భారీ ఎదురు దెబ్బ తగిలింది .
మొదటిరోజు 95.3 కోట్ల వరకు నెట్ కలెక్షన్లు సాధించిన కల్కి సినిమా రెండవ రోజు మాత్రం దాదాపు సగం షేర్స్ పడిపోయాయి..దారుణమైన వసూలు క్రియేట్ చేసింది. రెండవ రోజు ఇండియాలో కేవలం 50 కోట్ల వరకు మాత్రమే నెట్ వసూలు సాధించడం ప్రభాస్ ఫ్యాన్స్ కు షాకింగ్ గా ఉంది . ఇందులో తెలుగు నుంచి 24.65 కోట్లు ఉండగా.. తమిళంలో 3.5 కోట్లు ..హిందీలో 20.5 కోట్లు మలయాళం లో రెండు కోట్లు ..కన్నడాలో కేవలం 0.3 కోట్లు మాత్రమే వచ్చినట్లు తెలుస్తుంది . అయితే ఎలాగో వీకెండ్ వచ్చింది కాబట్టి శని – ఆదివారాలలో ఈ కలెక్షన్స్ ఊపందుకుంటాయి.. అంటున్నారు ట్రేడ్ వర్గాలు. అయితే సెకండ్ డే నే భారీ స్థాయిలో కల్కి సినిమా కలెక్షన్స్ పడిపోవడం ఫ్యాన్స్ ని డిసప్పాయింట్ చేసింది..!!