మనకు తెలిసిందే నందమూరి బాలకృష్ణ.. బోయపాటి దర్శకత్వంలో సినిమా అంటే కచ్చితంగా అరుపులు కేకలు వినపడాల్సిందే .. తొడ కొట్టడాలు.. మీసాలు మెలివేయడాలు .. తలలు నరకడాలు కచ్చితంగా ఉంటాయి . ఒక 10 – 15 సుమోలైన సరే .. గాల్లో ఎగరాల్సిందే ..ఒక 50 బాంబులైన బ్లాస్ట్ అవ్వాల్సిందే.. అలాంటి సీన్స్ ఎన్నో ఎన్నో వీళ్ల సినిమాలో చూసాం . రక్తపాతం లేనిదే బాలయ్య బోయపాటి సినిమా ఫినిష్ అవ్వదు. వీళ్ల కాంబోలో ఇప్పటివరకు తెరకెక్కిన సినిమాలలో ఈ సీన్స్ మనం కామన్ గా చూసి ఉంటాం .
అయితే త్వరలోనే బోయపాటి శ్రీను దర్శకత్వంలో మరొక సినిమాని సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు బాలయ్య . బీబీ ఫోర్ అంటూ ఆయన బర్త్డ డే సందర్భంగా కొత్త సినిమాని అనౌన్స్ చేశారు. ఈ సినిమా విషయంలో బాలయ్య చాలా స్ట్రిక్ట్ గా ఉన్నారట . ఎప్పటిలా కాకుండా ఈ సినిమాని పూర్తి మెసేజ్ ఓరియెంటెడ్ గా తెరకెక్కించాలి అంటూ డిసైడ్ అయ్యారట. నరుక్కోవడాలు.. అరుచుకోవడాలు కాకుండా.. జనాలకు ప్రజా సమస్యలకు ఒక పరిష్కారం చూపించే విధంగా రియల్ కాన్సెప్ట్ తో ఈ సినిమాని తెరకెక్కించాలనుకుంటున్నారట .
ఆశ్చర్యమేంటంటే బోయపాటి శ్రీను కూడా అందుకు ఓకే చేశాడు అంటూ సమాచారం అందుతుంది . దీంతో సోషల్ మీడియాలో ఇప్పుడు వీళ్ళకి సంబంధించిన ఇదే న్యూస్ వైరల్ గా మారింది . ఒకవేళ అదే జరిగితే మాత్రం నందమూరి ఫ్యాన్స్ కి కొంచెం హెడేక్ తప్పదనే చెప్పాలి ..బాలయ్య అంటే మాస్..మరి అటువంటి బాలయ్య మాస్ కాకుండా సైలెంట్ పాత్రలో కనిపిస్తే నందమూరి ఫ్యాన్స్ కి కిక్ ఏముంటుంది..??