సినిమా ఇండస్ట్రీలో కొన్ని కొన్ని జంటలు భలే ముద్దుగా ఉంటాయి. అఫ్కోర్స్ వాళ్ళు రియల్ కపుల్ కాకపోయినా సరే రియల్ కపుల్ అయితే బాగుంటుంది అన్న రేంజ్ లో వాళ్ళ పర్ఫామెన్స్ ఉంటుంది. కాగా సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో అందరికన్నా హైలైట్ అయిన జంట ఎవరు అంటే మాత్రం కచ్చితంగా అది ప్రభాస్ – అనుష్క అనే చెప్పాలి . వీళ్ళ కాంబోలో వచ్చిన ప్రతి సినిమా కూడా సూపర్ డూపర్ హిట్. మరి ముఖ్యంగా వీళ్ళిద్దరి జంట చాలా చూడముచ్చటగా ఉంటుంది . ఈడు జోడు చాలా చక్కగా ఉంటుంది. ఎవరైనా టక్కున చూస్తే భార్యాభర్తలేమో అని అనుకోకు తప్పదు .
అంత క్రేజీ పర్ఫెక్ట్ కపుల్ గా మ్యాచ్ అవుతారు . అయితే వీళ్ళు మాత్రం పెళ్లి విషయంలో ఏ మాత్రం నోరు విప్పడం లేదు . అయితే రీసెంట్గా ప్రభాస్ నటించిన కల్కి సినిమాలో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ను మిస్ చేసుకున్నింది అనుష్క శెట్టి అంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతుంది . అనుష్క శెట్టి నిశ్శబ్దం సినిమా తర్వాత చాలా టైం గ్యాప్ తీసుకొని చేసిన మూవీ మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి . ఈ సినిమా తర్వాత అనుష్క ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటుంది . అయితే నాగ్ అశ్వీన్ తెరకెక్కించే కల్కి సినిమాలో దీపికా పదుకొనే రూల్ లో అనుష్క శెట్టిను అనుకున్నారట మేకర్స్ .
కానీ ఆమె ఈ పాత్రను సున్నితంగా రిజెక్ట్ చేసిందట . అసలకే సోషల్ మీడియాలో ప్రభాస్ అనుష్కల పేర్లు మారుమ్రోగిపోతూ ఉంటాయి. ఒకవేళ ఈ పాత్రలో కలిసి నటిస్తే మాత్రం వాళ్ల పేర్లు మరింత స్థాయిలో సోషల్ మీడియాలో వినిపించడం ట్రోల్ అవడం ఖాయం.. ఆ భయంతోనే అనుష్క శెట్టి ఈ పాత్రను మిస్ చేసుకుందట. అయితే ఇన్సైడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ పాత్ర కోసం నాగ్ అశ్వీన్ అనుష్కని చూస్ చేసుకున్న మేటర్ నిజమే కానీ అనుష్క కన్నా దీపిక పదుకొనే లుక్స్ బాగుంటాయి ఈ పాత్రకి అని పెద్దవారు సజెస్ట్ చేయడంతో లాస్ట్ మినిట్ లో ఆయన తన నిర్ణయం మార్చుకున్నాడు అని సమాచారం అందుతుంది . మొత్తానికి దీపికా పదుకొనే ఈ పాత్రలో చించిపడేసింది అని రీసెంట్గా రిలీజ్ అయిన సెకండ్ ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది..!!