Moviesమొన్న బన్నీ.. ఇప్పుడు ఈ హీరో..సమంతని దూరం పెడుతున్న స్టార్ హీరోలు..ఎందుకంటే..?

మొన్న బన్నీ.. ఇప్పుడు ఈ హీరో..సమంతని దూరం పెడుతున్న స్టార్ హీరోలు..ఎందుకంటే..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో ఎక్కువగా ట్రెండ్ అవుతుంది. హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు . తనదైన స్టైల్ లో ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది . అయితే నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె తలరాత మారిపోయింది. హాట్ ఎక్స్పోజింగ్ రోల్స్ల్లో నటించే సమంత కేవలం ట్రెడిషనల్ పాత్రలకే ఓకే చేసింది . నాగచైతన్య సమంతల మధ్య వచ్చిన మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకున్నారు . ఆ తర్వాత ఇండస్ట్రీలో ఆమె క్రేజ్ ఢమాల్ అంటూ పడిపోయింది.

పలు సందర్భాలలో సమంత పేరు మారుమ్రోగిపోయిన పెద్ద పెద్ద హీరోలు మాత్రం అవకాశం ఇవ్వలేకపోయారు. తాజాగా సమంత ఖాతాలో ఒక బిగ్ బంపర్ ఆఫర్ ఎగిరిపోయింది అంటూ ప్రచారం జరుగుతుంది . అల్లు అర్జున్ అట్లీ కాంబో సినిమాలో హీరోయిన్ గా సమంతని అనుకున్నారు. అయితే కొన్ని కారణాల చేత ఈ సినిమా ఆగిపోయినట్లు తెలుస్తుంది . ఇప్పుడు సమంతకు మరో బిగ్ షాక్ తగిలింది . తన ఫేవరెట్ హీరో షారుఖ్ ఖాన్ సినిమాలో ఆఫర్ వచ్చినట్లే వచ్చి చేజారిపోయినట్లు తెలుస్తుంది . బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ కి హీరోయిన్ సమంత పెద్ద బిగ్ ఫ్యాన్ అన్న విషయం అందరికీ తెలుసు .

ప్రస్తుతం షారుఖ్ ఖాన్ నటించిన సినిమాలో ఆమె హీరోయిన్గా అవకాశం దక్కించుకుంది అంటూ రూమర్స్ బాగా ట్రెండ్ అయ్యాయి . అయితే అది ఏమాత్రం నిజం కాదు అంటూ తేల్చేశారు మేకర్స్. టాలెంటెడ్ డైరెక్టర్ రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్‌ మరో సినిమా చేయబోతున్నారని ఉంది. ఈ చిత్రంలో సమంతను హీరోయిన్‌గా తీసుకునేందుకు చర్చలు జరుగుతున్నాయని అన్నారు. ఇదే నిజమైతే షారూఖ్ తో, రాజ్‌కుమార్ హిరానీతో సమంతకి ఇదే తొలి సినిమా అయ్యేది. కానీ అది ప్రస్తుతానికి ఈ వార్త రూమర్ అనే క్లారిటీ వచ్చింది. దీంతో స్టార్ హీరోలు సమంతని దూరం పెడుతున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకు సమంతకే ఇలా జరుగుతుంది అంటూ ఫ్యాన్స్ బాధపడిపోతున్నారు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news