Moviesఇండస్ట్రీలోకి వచ్చి ఇన్నేళ్లు అవుతున్నా..పవన్ ఇప్పటి వరకు ఆ పని చేయకపోవడానికి...

ఇండస్ట్రీలోకి వచ్చి ఇన్నేళ్లు అవుతున్నా..పవన్ ఇప్పటి వరకు ఆ పని చేయకపోవడానికి కారణం అదేనా..? నిజంగా దేవుడే సామీ నువ్వు..!!

మనకు తెలిసిందే ..సినిమా ఇండస్ట్రీలో కేవలం సినిమాల్లో నటించడమే కాదు పలు యాడ్స్ లో కూడా నటించి డబ్బులు సంపాదించుకుంటూ ఉంటారు. మహేష్ బాబు – అల్లు అర్జున్ – షారుక్ ఖాన్ – హృతిక్ రోషన్ లాంటి స్టార్ హీరోస్ కేవలం యాడ్స్ లో నటించిన కారణంగానే కోట్లు తీసుకుంటారు అన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే కొంతమంది స్టార్స్ మాత్రం అసలు యాడ్స్ లో నటించడానికి ఇంట్రెస్ట్ చూపించరు .

దానికి కారణాలు ఏవైనా కావచ్చు.. మరీ ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి బాలయ్య – పవన్ కళ్యాణ్ లాంటి హీరోలు ఇప్పటివరకు యాడ్స్ లో నటించ లేదు . ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఒక వార్త బాగా వైరల్ గా మారింది . పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎంతటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ అందుకున్న వ్యక్తి నో అందరికి తెలిసిందే . పవన్ కళ్యాణ్ ప్రెసెంట్.. రాజకీయాలలో బిజీగా ఉన్నాడు .

ఇలాంటి మూమెంట్ లోనే పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఒక వార్త బాగా ట్రెండ్ అవుతుంది. పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు యాడ్స్ లో నటించకపోవడానికి కారణం ఆయనకు ఇష్టం లేకపోవడమే అని అంత అనుకున్నారు .కానీ పవన్ కళ్యాణ్ గతంలో ఒక కోలా యాడ్లో నటించారు . ఆ తర్వాత అది ఆరోగ్యానికి ప్రమాదకరమని తెలిసి ఆ తర్వాత నుంచి యాడ్స్ చేయడమే మానేశారు . చాలాసార్లు హ్యూజ్ రెమ్యూనరేషన్ ఇస్తామంటూ పవన్ కళ్యాణ్ కి ఆఫర్లు వచ్చినా సరే ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా ఉండే యాడ్స్ చేయను అంటూ భీష్ముంచుకుని కూర్చున్నారు . డబ్బుకోసం ఏ పనైనా చేసే టైప్ కాదు నేను అంటూ చాలా ఇంటర్వ్యూలలో పవన్ కళ్యాణ్ చెప్పుకు రావడం గమనార్హం. ప్రజల గురించి వాళ్ల క్షేమం గురించి ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారు పవన్ కళ్యాణ్..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news