Moviesఅంతా బాగున్నా దేవర ఫియర్ సాంగ్ కి ఆ ఒక్కటే మైనస్...

అంతా బాగున్నా దేవర ఫియర్ సాంగ్ కి ఆ ఒక్కటే మైనస్ గా మారిందా..? జర జాగ్రత్త కొరటాల..!

ఏంటో .. ఈ మధ్యకాలంలో ఫాన్స్ ని సాటిస్ఫై చేసే మ్యూజిక్ డైరెక్టర్స్ కరువైపోయారు .. ఒకప్పుడు మణిశర్మ – చక్రి – దేవి శ్రీ ప్రసాద్ ఎలాంటి క్లాసిక్ ట్రెండీ మాస్ మ్యూజిక్ ఇచ్చేవాళ్లో అందరికీ తెలిసిందే. అయితే ఈ మధ్యకాలంలో అలాంటి మ్యూజిక్ తో ఎవ్వరు ఆకట్టుకోలేకపోతున్నారు . సినిమా కథలు హిట్ అవుతున్నా.. మ్యూజిక్స్ అదే విధంగా కొన్ని కొన్ని పాటలు జనాలను ఆకట్టుకోలేకపోతున్నాయి.. ప్రెసెంట్ ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా విషయంలోనూ అవే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న సినిమా దేవర . ఈ సినిమా థర్డ్ షెడ్యూల్ థాయిలాండ్ లో జరుగుతుంది. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఫియర్ లిరికల్ సాంగ్ రిలీజ్ చేసింది చిత్రం బృందం . అయితే లిరిక్స్ బాగానే ఉన్నప్పటికీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం ఎక్కడో హాలీవుడ్ మ్యూజిక్ స్టైల్ లో ఉంది అనిపిస్తుంది . కానీ తెలుగు జనాలను ఇంప్రెస్ చేసే విధంగా మాస్ బీట్స్ లేవు అంటున్నారు అభిమానులు.

దేవర అంటేనే మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ .. ఎన్టీఆర్ సినిమాలో మాస్ బీట్ లేకుండా ఎలా..? అనిరుధ్ మ్యూజిక్ బాగుంది .. కానీ అదంతా హాలీవుడ్ స్థాయిలోనే ఉంది అంటూ అసహనంగా కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రజెంట్ ఇప్పుడు దేవర సినిమాకి సంబంధించిన ఇదే న్యూస్ వైరల్ గా మారింది . చూద్దాం.. మరి ఫ్యూచర్ లోనైనా రిలీజ్ అయ్యే సాంగ్స్ ను ఏ విధంగా సెట్ చేసుకోబోతున్నాడొ ఈ కొరటాల శివ..?

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news